పుట:Navanadhacharitra.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమా శ్వాసము

217

సోమార్ధశేఖరుఁ ◆ జూచు [1]కౌతుకము
మనమున నిండార ◆ మహిమ మీఱఁగను
నెనయు శ్రీనగమున ◆ కే తెంచి యచట
వినఁజూడ నరుదార ◆ [2]వింతఁ దాఁజూచెఁ
దనరు మంజరుల నె ◆ త్తావులఁ జల్లు
భూరుహంబుల ముని ◆ పుత్రులు ప్రమద
మార భిక్షాందేహి ◆ యనుచు డగ్గఱినఁ
బరిపక్వ ఫలములు ◆ పత్రముల్ నిండఁ
గురియు పాదపముల ◆ గుంపుగాఁ బొదలి
తిరముగా నీడలు ◆ తిరుగని తరుల
సురత కేళీలోల ◆ సురసిద్ధ మిథున
పరిలులి తానల్ప ◆ పల్లవతల్ప
పరిమళ సురభిత ◆ బహులతాభవన
సముదయంబుల శివా ◆ ర్చన లాచరించు
సమయబు లెఱిఁగి ని ◆ శ్చలభ క్తిఁ జేరి
పొగడొందు ఫలదళ ◆ పుష్పమూలంబు
లోగి వృద్ధమునులకు ◆ నొసఁగు క్రోఁతులను
మరిగి పంచల బ్రహ్మ ◆ మంత్రజపంబుఁ
బరువడిఁ బలికెడు ◆ బాలకీరములఁ
బంచాక్షరీమంత్ర ◆ పఠనమైఁ బొందు
పంచమశ్రుతిసేయు ◆ పరభృతంబులను
గ్రందుగాఁ బథపరి ◆ శ్రాంత మానసుల
నిందిందు రండు మీ ◆ రిట మహీజముల
నీడల నొక్కింత ◆ నిలువుఁ డీపండ్లు
వేడుకఁ గొండను ◆ విహగసంతతులఁ
బరమేశ్వర ధ్యాన ◆ పరిణతానంద
పరిపూర్ణచిత్తులై ◆ బాహ్యంబు మఱచి
యున్న యోగీంద్రుల ◆ [3]నొడళులఁ గదిసి
నున్ననిమేనుల ◆ నూల్కొను తీఁట
నపహరింపగ రాయు ◆ హరిణపోతములఁ
దపసులుచోప రం ◆ ధ్రద్వారములను
ముదమునఁ దలలెత్తి ◆ ముని కుమారకులు

  1. కరుణయు.
  2. విద్య.
  3. నొడపక.