పుట:Navanadhacharitra.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

216

నవనాథచరిత్ర

మనమారఁజేరి స ◆ మ్మతిఁ గ్రుంకువారి
[1]కలుషంబులనుబాపి ◆ గరిమఁ జెన్నారి
పొలుపొందుజంభారి ◆ పురి మనోహారి
సులభసంగతిఁ జేరి ◆ సుఖములఁగోరి
చెలఁగుచుండెడివారిఁ ◆ జేర్చు కావేరి
రయమునదాఁటి తీ ◆ రంబున నుచిత
నియమంబు లన్నియు ◆ నిష్ఠతో జరిపి
నిండువెన్నెలమీఁద ◆ నిగిడిన వెండి
కొండ యొప్పారు లా ◆ గున భూతిపూఁత
నరుదైన గౌరదే ◆ హము ప్రకాశింపఁ
బరగు నాచంద్రిక ◆ పై నెఱసంజ
గిరిగొన్నగతిఁ దొడి ◆ గిన పట్టుగంత
[2]నెరయఁగ నగశృంగ ◆ నిలయమైవెలయు
వాసవు[3]ధనువు కై ◆ వడి మస్తకమున
భాసురంబై పట్టు ◆ పట్టియ మెఱయ
ననువొందఁ [4]దరి గొండ ◆ నడిచుట్టుకొనిన
ఘనభోగి భోగంబు ◆ కరణి నెన్నడుమఁ
బదిలమై యెడ్డాణ ◆ బంధంబుదనర
వదనచంద్రునిఁ గొల్వ ◆ వచ్చినరీతి
నక్షత్రచక్రంబు ◆ నాఁగర్ణకోటి
నక్షమాలిక యుజ్జ్వ ◆ లాకృతిమెఱయ
యోగదండము గేల ◆ నొప్ప మేదినికి
నాగతుండైన పు ◆ ష్పాయుధారాతి
చెలువున శోభిల్లి ◆ శిష్యబృందంబు
బలసిరా నానీల ◆ పర్వతం బెక్కి
క్రందుగా నామీఁదఁ ◆ గలుగు తీర్థముల
కందువ లన్నియుఁ ◆ గనుఁగొని యెలమి
నారాత్రి యందుండి ◆ యమ్మఱునాఁడు
చారుమార్గమున నా ◆ శైలంబు డిగ్గి
చరియింపనున్న దే ◆ శంబులు మీరు
చరియింపుఁ డని శిష్య ◆ చయములఁ బంపి
శ్రీ మల్లి కార్జున ◆ శ్రీమహాదేవు

  1. కలుషపంబులుంజేరి.
  2. నెరయు నంగశృంగ.
  3. వాసవందనపుకైవడి.
  4. చలిగొండ.