పుట:Navanadhacharitra.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

149

అనువునఁ జనుచున్న ◆ యామందసంబు
వడుగులు కని యుబ్బి ◆ వడిఁ గుప్పిగంతు
లిడుచు నొండొరుఁ గేక ◆ లిడుచుఁ జప్పట్లు
కొట్టి చంకలువేసి ◆ కొనుచుఁ జెలంగి
పట్టి మందసఁ దెచ్చి ◆ పరగ నయ్యేటి
పొంతఁ బ్రబ్బినప్రబ్బ ◆ పొదలలో నునిచి
సంతసం బెసఁగ నొ ◆ జ్జలరాక కెదురు
చూచుచునుండి ర ◆ చ్చోట నావిప్రుఁ
డీచేటుపాటుఁ దా ◆నెఱుఁగక దక్కె
రాచకూఁతురు మనో ◆ రథసిద్ధి యెసఁగె
నా చపలాక్షిఁ జ ◆ య్యనఁ బొందకున్న
నేఁచిన నీమనం ◆ బె ట్లాపవచ్చు
వేఁచి కాఱించు పూ ◆ విలుతు కే నింక
నని సంభ్రమింపుచు ◆ నర్కున కెఱఁగ
ఘనతరంబుగఁ గాయ ◆ గట్టిననుదుటఁ
బొడవైన పెనుబొల్లి ◆ బొట్టును మొదలఁ
బెడసి రాలుచునున్న ◆ [1]పెడతల నరల
దులిచినసికయు సం ◆ దులఁబాఁకు వట్టి
బలువు గప్పిన గొగ్గి ◆ పండ్లును బిట్టు
పడికి కం పెసఁగెడి ◆ బడబాకినోరు
జెడసు [2]చెవులుఁ గుఱు ◆ పీఁచు గడ్డమును
బరుసు మీసముఁ జెక్కు ◆ పైఁ బులిపిరియు
నుఱుకుబొడ్డును మేన ◆ నొదవిన దద్దుఁ
బిల్లికన్నులు బల్ల ◆ పెరిఁగినకడుపు
గిల్లచూపులుఁ జాల ◆ గిరికొన్న బొచ్చు
బొలిబొట్టు గూనివీఁ ◆ పును బుఱ్ఱముక్కుఁ
గలుకును మెడమీఁది ◆ కంతియు నీచ
బోయిన పిఱుఁదును ◆ బుస్తుదోవతియు
దాయ జంక నిడిన ◆ దర్భసంబెలయుఁ
గోలయుఁ [3]గుఱుమెట్లు ◆ గొడుగును ముఱికి
పేలికెయును ముళ్లు ◆ బెట్టిన జంధ్య
ములును బంచాంగంబు ◆ ముష్టియుఁ జిల్లు

.

  1. పదతటి.
  2. చెయినినురుపించు గండమును.
  3. గురుబిట్టు.