పుట:Navanadhacharitra.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xix

ముచే వానిం గ్రమ్మఱఁ బడసి సిద్ధులలోఁ గలసి యొక సిద్ధుఁడై యుండి "మొన్నటి కీలక సంవత్సరమున" మతంగగిరికడ నావ్యాకరణమును బాల సరస్వతుల కొసఁగఁగానాతఁ డద్దాని కొక టీకఁ గూడ వ్రాసెనఁట. అట్లు భీమకవి గోదావరిలోఁ గలిపిన గ్రంథమును మరల రాజనరేంద్రక్ష్మాదయితునిపట్టి మహిని వెలయించినవాఁడయ్యెను. ఎనుబది రెండార్యలు గలిగి, పరిచ్ఛేద పంచకమునఁ దగు నా ఫక్కి మతంగాచల విప్రునివలన నప్పకవి సదనము చేరుననియు, సంస్కృతమున వాగనుశాసనుఁడు రచించి నప్పుడు మును నారాయణధీరుఁ డాతనికి సహాయుఁ డయినట్లే, దానిని దెనిఁగించుటలోఁ దా నాతనికిఁ దో డగుదుననియుఁగూడ విష్ణువు చెప్పెను. నన్నయకవి ప్రక్రియా కౌముదిని నారికేళపాకముగాఁ జెప్పినాఁడు. కావునఁ గేవ లాంధ్రులా త్రోవఁ గానలేరు. మఱియు సంస్కృతగ్రంథములోఁ దెనుఁగు కలియఁగూడదు గనుక లక్షణంబు మాత్రమె చెప్పెనుగాని లక్ష్యమొక్కటియు నాతఁడు చెప్పలేదు. తాతన నూత్నదండియు నింతకుఁ బూర్వము తెలుఁగుల లక్షణం బొకించుక యైనను జేయక పోలేదు. కాని యవి యాంధ్రభాషామహాకాననాంతర మున శబ్దాపశబ్ద సరణు లెఱింగించుటలో దీనివంటివి గావు గావున నిది కవులకు విశేషోపకారక మగు నని చెప్పి విష్ణువు చనెను.

అప్పకవికిఁగలలోఁ బ్రత్యక్షంబై నన్నయఫక్కి నిగూర్చిన యీ యసంబద్ధపుగాథ నంతను జెప్పిన యీ విష్ణు వీతని యిష్టదైవ మగుటచే నీ దెనుఁగు సేతలో నీతనికి సాయముచేసినఁ జేసియుండవచ్చును గాని, వాగనుశాసనుఁ డా సంస్కృతగ్రంథమును “మును నారాయణధీరుఁడు దనకు సహాయుఁడుగ" రచించెనో లేదో నిర్ణయించుట కీ విష్ణుమూర్తి పలుకులు తప్ప వేఱాధార మేమియుఁ గనఁబడదు. ఆ నన్నయఫక్కిలో నీ నారాయణునిఁగూర్చిన ప్రశంస యేమియు లేదు గదా! ఇఁక భారతరచనమును వలెనే దీనిఁగూడ “సహాధ్యాయుఁడు నైనవాఁ డభిమతంబుగఁ దోడయి నిర్వహించి యుండు" నని యెంచి యప్పకవి యట్లు కల్పించి యుండవచ్చును. కాని, భారతములోని "పాయక పాకశాసని"కను పద్యమే ప్రక్షిప్తంబుగాఁ గనఁబడుచున్నది. అప్పకవి 'జానపదు లోడక దిద్ది' రని తెలిపిన రీతిగా నాతనికిఁ బూర్వమే యెవ్వరో యా పద్యమును రచించి యాగ్రంథమునఁ జేర్చియుందు రేమో యని తలంపవలసి వచ్చుచున్నది. ఏల యనఁగా, నాంధ్రభారతము ప్రాఁతవ్రాఁతప్రతులను బరిశీలింపఁగాఁ బెక్కింటిలో నీ "పాయక పాకశాసని” కన్న పద్యమే కనఁబడుట లేదు. కొన్ని ప్రతులలో నుండుటం బట్టి, యా గ్రంథము నిటీవలివా రందఱు నద్దానిని సంగ్రహించి యుందురు. ప్రాచీనమాతృకనుబట్టి వ్రాసినవా రీ పద్యమును మాత్రము వదలివేసి రనుట సంభావ్యము కాదు గదా. నుమా రిరువది ప్రాచీన