పుట:Navanadhacharitra.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

141

మఱపించునుదురును ◆ మలయు బేడిసల
మఱిఁగించు కన్నులు ◆ మణి దర్పణముల
తెఱఁగగు చెక్కులుఁ ◆ దిలకుసుమంబు
మిగులునాసిక యును ◆ మేలిమి మొల్ల
మొగడల నగు దంత ◆ ములు బింబఫలము
దలఁపించు నధరంబు ◆ దర్పకుశంఖ
కలితసౌభాగ్యంబుఁ ◆ గడచిన గళము
బిసముల నటమటిం ◆ పెడి బాహులతలుఁ
గిసయంబుల పెంపు ◆ గెలుచు హస్తములుఁ
జిన్ని జక్కవలతోఁ • జిటిపొటిసేయు
చన్ను మొగ్గలుఁ [1]బాప ◆ చందంబు లీల
తిన్న తనంభా మ ◆ తించు నూఁగారు
నన్నువపిడికిట ◆ నణఁగు నెన్నడుము
సైకతంబుల మించు ◆ జఘనంబు ననఁటి
మ్రోఁకల నిరసించు ◆ ముద్దు పెందొడలుఁ
గనక కాహళల బిం ◆ కము దువాళించు
నునుజిఱుదొడలుఁ జెం ◆ దొవలసోయగము
[2]కలవైన వ్రేళుల ◆ నమరు మీఁ గాళ్లు
అలవై న వేడ్కల ◆ నలరు విధములఁ
పొలఁగనలరు పెం ◆ పొందు మన్మథుని[3]
లాలిత సామ్రాజ్య ◆ లక్ష్మి చందమున
గరువంపుఁ గలహంసి ◆ కల వింతగతుల
మురువు బిసాళించు ◆ మురిపెంపు నడల
మనసిజ మోహన ◆ మంత్ర దేవతను
మొనపు చందమున నూ ◆ పురములు మొరయ
శృంగార మలవడఁ ◆ జేసి నెచ్చెలుల
సంగడి మెలఁగు న ◆ జ్జలజాక్షిఁ జూచి
మోహించి కామాంధ ◆ మునఁ దారతమ్య
మూహింపలేక పె ◆ ల్లొదవు తత్తరము
చిత్తంబుఁ బిరివీకు ◆ చేయ నారాట
మెత్తి విధాత న ◆ న్నేల పుట్టించె
నీ మాలకులమున ◆ నిది గాల్చి పోయి

  1. పుష్పచందంబు.
  2. నలవైన యిందిరుల్ సమర.
  3. పొలుపలరసొ... బెంపును.