పుట:Navanadhacharitra.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xvii

యీ దేశమునఁ బ్రబలియుండు ననిమాత్రము చెప్పవచ్చును. అప్పకవియే సారంగధరుని కథకును నన్నయాంధ్రఫక్కి కిని సంబంధమును గలిగించినవాఁడై యుండిన నుండవచ్చును. ఈ కథ రాజమహేంద్రవర పట్టణమునకును, దాని నొక కాలమునఁ బరిపాలించి రాజమహేంద్రుఁ డని ప్రసిద్ధివడసిన చాళుక్య రాజగు రాజరాజునకును సంబంధించినదను విశ్వాసము జనులలో వ్యాపించిన పిదప, నచ్చటివారా కథా విశేషములకు స్థలనిర్దేశమును గూడఁ జేసియుందురు. కావుననే యిప్పటికి నాయూర నిది సారంగధరుని మెట్టయనియు, నిదీ యాతని కాలుసేతులు నఱకించిన చోటనియు, నిది చిత్రాంగి మేడ యనియు స్థలనిర్దేశములతో నా కథావిశేషములను జెప్పుకొనుచుండుట తటస్థించి యుండును. చారిత్రక విషయములకును, జన వాదమునకు నొకప్పు డెట్టి సంబంధము లేకపోవచ్చు ననుట కిదియొక మంచి నిదర్శనముగాఁ గనఁబడుచున్నది. ఇంక నప్పకవీయ రచనా సందర్భము నందలి సారంగధర కథా ప్రశంసను గూర్చి యించుక పరిశీలింతము.

అప్పకవీయ మనునది నన్నయఫక్కీ, ప్రక్రియాకౌముది, యనఁబరగు నాంధ్రశబ్దచింతామణి కాంధ్రీకరణము. ఈతఁడు తెనుఁగున ఘనకావ్యం బొక్కటి చేయఁ దలఁచి యున్నతఱి నీతని కులదైవమగు కామెపలి గోపాలకృష్ణుఁ డొకనాఁడు కలలోఁ బ్రత్యక్షంబై

"స్వ, శ్రేయస మబ్బు నీకు నిఁక సిద్ధము నన్నయఫక్కి యాంధ్రముం
 జేయుము మా యనుగ్రహముచేఁ గవు లచ్చెరువంది. మెచ్చగఁన్."

అని యానతిచ్చినాఁడు. కాని యప్పకవి కప్పటి కా నన్నయఫక్కి.. యన నేమో తెలియదు. ఆతఁ డెప్పుడును దానిని వినికని యెఱుఁగఁడు, ఆ విషయము కూడ సర్వసాక్షి యగు నా విష్ణువే చెప్పుచు నా గ్రంథప్రభావమును, దాని పూర్వచరిత్ర మంతను గూడ నా కలలో నాతని కిట్లెఱిగింపఁ దొడఁగెను.

"కం. వినియును గనియును నెఱుఁగని,
      ఘనఫక్కిం దెనుఁగుఁ జేయఁగా నెట్లగు నా
      కనవలదు దాని లక్షణ
      మును నీకది గలుగుచందమును వినుమింకన్"

ఆంధ్రశబ్దచింతామణి వ్యాకరణము ముందు రచించి, తత్సూత్రములఁ దెనుఁగుబాసచే నన్నయభట్టు శ్రీ మహాభారతమున మూఁడు పర్వములు చెప్పెను. ఆ సమయంబున భారతముఁ దెనిఁగించుచుఁ - లేదా తెనుఁగించుట మూలముగా-దాను రచించిన రాఘవపాండవీయమును నన్నయ యణఁచి వేసినాఁడు. ఇప్పుడు తాను రచించు ఛందమునఁ (ఈతనిది ఛందోగ్రంథమా? వ్యాకరణమా?) దనఛందోగ్రంథము నణఁచివేయుటకై యీ ఫక్కి రచింప మొదలు