పుట:Narayana Rao Novel.djvu/290

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇ ష్టా గో ష్టి

289

శ్యామ: ప్రపంచం అంతా కలిసే ఉండాలనిగా లెనిను, స్టాలిను, ట్రాట్స్కీ మొదలగు వాళ్లు వాదించేది. ఉన్న ధనమంతా పోగుచేసి జనాభాని బట్టి దేశాలు పంచుకోవడం, ఏ దేశంలో ఏ పంట ఎంత పండునో లెక్కలు వేయడం, ప్రపంచానికి కావలసినంత పంటమాత్రం పండించడం, అది దేశాలన్నీ పంచుకోడం. ప్రతీపంటా అంతే! అలాగే బంగారు మొదలగు లోహాలు. ఆ లోహాలన్నీ శాస్త్రవృద్ధికోసం. నాణేలు అవసరంలేదుగా! ప్రపంచం అంతా కలిసి అంగారకుడిదగ్గరకు వెళ్ళుటకు ప్రయత్నం మొదలైనవి చేయవచ్చును. ఈలాగే సర్వశాస్త్రజ్ఞానమూ వృద్ధి చేయాలి.

నారా: లేదూ, భగవంతునిగూర్చి తెలిసికొనుట కన్నిజాతులకు సౌకర్యము కలుగజేయవచ్చును.

పర: ఓహో మీ యిద్దరి స్వప్నమూ చాలా బాగుంది. అయితే, తెల్లవాడు నల్లవాడిని దగ్గరకు రానిస్తాడా? పచ్చవాడికి పచ్చవాడిపచ్చ కిట్టదు. చీనాకు, జపానుకు యుద్ధం రాదంటారా!

శ్యామ: అన్నా, అదేమిటి మీ వాదం! వినండి. ప్రపంచమంతా బోల్షివిజం వ్యాపించడానికి కొన్ని యుగాలు కావచ్చును. ధనంఉన్న షాహుకార్లకు శక్తి ఉన్నంత కాలం రాజ్యాలు వదలరు. కాని ప్రపంచంలో ఎక్కువ సంఖ్య ఎవరు? కూలి నాలి చేసుకునేవారేకదా? బీదవాళ్ళగువారు తలచుకుంటే ఏమి చేస్తారు షాహుకార్లు?

రోహిణి: మనదేశం ముప్పదిమూడుకోట్లు ఏమి చేస్తున్నాము తుపాకీ ముందర?

శ్యామ: ప్రపంచంలో తుపాకీ పట్టుకునే వాళ్లంతా బీదవాళ్ళేగా! రష్యాలో వాళ్ళు తిరగబడితేనేగా షాహుకార్లయొక్కయు, ప్రభువులయొక్కయు రాజ్యం కూలబడింది?

పర: ధనం యొక్క ఉత్కృష్టత ఏమిటో చెపుతా విను. ధనవంతుడు తన ధనసంపాదన ప్రయత్నంలో దేశానికి అనేక లాభాలను సమకూరుస్తాడు. దానివల్ల లోకానికి కావలసిన వస్తువులన్నీ తయారవుతాయి. అమెరికాలో, ఇంగ్లండులో, జర్మనీలో, ఫ్రాంసులో అంతే! ఇనుపచక్రవర్తులు, కిరసనాయిలు సార్వభౌములు, బిస్కట్ల మహారాజులు, మోటారు రాజాధిరాజులు వగైరా వగైరా! వీరంతా ఉండడముచేత దేశదేశాలకు ఆ వస్తువులు సరఫరా అవుతున్నవి.

శ్యామ: అన్నా , నువ్వు చెప్పే వాదనలో అన్నీ దోషాలే.

నారా: 1919 సంవత్సరంలో యూరపుఖండంలో మహాయుద్ధం ఆఖరయింది. ప్రపంచం అంతా విప్లవం వచ్చేటట్లు కనబడింది. కాని అమెరికా వాళ్ళు బంగారం పట్టుకువచ్చి యూరపు అంతా వెదజల్లినారు. దానితో యుద్దంవల్ల అలిసిన ప్రజలంతా, ‘బాగుంది! మనస్థితి బాగుంది’ అని సంతో