పుట:Narayana Rao Novel.djvu/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మదరాసు కాపురము

253

కూర్చుండెను. న్యాయప్రభువును ఆ బాలుని చమత్కృతికి, భాషకు, విషయ నిర్ధారణప్రజ్ఞకు జాల మెచ్చుకొన్నాడు. ఇతర న్యాయవాదులయినచో నరగంటలో దేల్పజాలని యాయప్పీలు పదినిముషములలో ముగించినాడు. ఎదిరి వకీలు వాదమునకు నలుబదియయిదు నిముషములు పట్టినది. ఆతని వాదన పేలవమై తోచెను. నారాయణరావు గొంతుక గంభీరమయినది. దానికి తగినట్లు దివ్యోత్తమాంగుడు. ఎక్కడెక్కడి విషయములు కరతలామలకముగ గ్రహించగల మహామేధావి. ఎదిరి న్యాయవాది చేసిన అడ్డువాదనను అయిదు నిముషములలో ఖండించి కూర్చున్నాడు నారాయణరావు.

తత్‌క్షణమే న్యాయమూర్తి నారాయణరావు పక్షమున దీర్పు జెప్పినాడు. గురువుగారగు జయరామయ్యయు నితర న్యాయవాదులును నారాయణరావు నభినందించిరి.

న్యాయశాస్త్రములో, న్యాయవాదములో నెంత మునుగుదమన్నను మనస్సేమియు నెక్కుటలేదు. తాను బాగుగా పని చేయుచున్నట్లు కనబడుటకుగాను జయరామయ్యగారి యింటికడ నపరిమితావేశముతో, మంచినిపుణతతో, ఓర్పుతో బనిచేయును. ఇంటికడ కలతనొందుచు, కలలలో మునిగిపోవును.

కలలు! కలలు! ఏ కలగన్న నాకలలో నెచ్చటనో శారద ప్రత్యక్షమగును. ఇదివరకు బండుకొనుట తడవుగ నిద్రపట్టునది నారాయణునకు. ఇపుడు గంటయు, రెండుగంటలు స్వప్నప్రపంచములో నివసింపవలసివచ్చు చుండెను, నాతిగల బ్రహ్మచర్యము! శారదకు బ్రేమకుదురునో కుదురదో? కుదురనిచో దన కర్తవ్యమేమి? ఒకవేళ భార్య అన్యాసక్త కాదుగదా! నిజమైన కర్మయోగి పవిత్రకాలమున నొక పుత్రుని, పుత్రికను గనవలెను. భార్యనైనను మోహమున దాకగూడదు. అది మహాదోషము. తా నా విధమున నుండలేనప్పుడు దోషమగునుకదా! తన భార్యయే అట్టిదోష మాచరించుచుండ దాను సహించవలసినదేనా?

ఇది చిన్నతనములో వివాహము చేయుటవలన నైన దోషమా? వైద్యశాస్త్రము బాలికకు పదునారవయేట బెండ్లి యుక్తమేనన్నది. కొందరి కా యీడున హృదయము వికసించకపోవచ్చును. ఇంతకు భార్య పరపురుషు నాశించినచో దన కర్తవ్యమేమి? తన హృదయాంతరమున నామె యట్లాశించుట దోషమనియే తోచుచున్నది. ఇతరులు దోషమాచరించుచుండ వారి నా మార్గమునుండి త్రిప్పగలవా రుపేక్షింపరాదు. ఒకరిమోక్షమున కొకరు కారణమగుట కలదేని, యొక్క గురువునకుమాత్రమే యట్టిపని శక్యమగును. తాను శారదకు గురువా? ధర్మశాస్త్రము భర్తకు గురుస్థానము చెప్పినది. నిజమే. తన భార్యయెడల దనకట్టి యర్హతకలదా?

తెలిసీ తెలియని ధర్మవిచార మొకప్రక్క, భార్యపై తనకున్న పూర్ణ కాంక్ష యొకప్రక్క ‘నాతో కాపురం చేయడం ఆమెకు కష్టం, కంటకం,