పుట:Narayana Rao Novel.djvu/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద స రా

175

నాచార్యపదవి దొరికినది. అప్పటినుండియు రమణమ్మతో, బిడ్డతో, దనతల్లితో లక్ష్మీపతి రాజమహేంద్రవరమున గాపురము ప్రారంభించినాడు. జమీందారుగారి పెద్దమ్మాయి శకుంతలాదేవి వచ్చినది. పెద్దయల్లు డా పండుగ రెండు రోజులు వచ్చునట. జగన్మోహనరావునకు భర్తను పోరి యాహ్వాన మంపించినది వరదకామేశ్వరమ్మ, తానును తప్పక రావలసినదని వ్రాయుచు, కొమార్తె శారదచేగూడ వ్రాయించినది. చెన్నపట్టణమునుండి యానందరావుగారి భార్య వచ్చెను.

నారాయణరావునకు సెలవులు ముందుగనే యిచ్చుటచే, నాతడు కొత్తపేట వెళ్ళి, యచ్చటనుండి, రేపు మహర్నవమి యన దన చుట్టములతో గలసి వచ్చినా డత్తవారింటికి.

జమీందారుగారి పెద్దయల్లుడగు డిప్యూటీకలెక్టరు గారున్ను, చెన్నపట్టణము నుండి ఆనందరావుగారును పండుగనాటికి విచ్చేసినారు.

నారాయణరావు చెన్నపట్టణములో నున్నంతకాల మొక్కసారియైన నానందరావుగా రా బాలుని దనయింటికి బిలిచినపాపాన బోలేదు. జమీందారుగారు శాసనసభా వ్యవహారములపై నచ్చటికి వచ్చినప్పు డానందరావుగారు తన కారుమీద జమీందారుగారి భవనమునకు వచ్చి కలుసుకొని, యాయనను దన యింటికి బిలుచుకొనిపోయినాడు. నారాయణరావుతో మాట్లాడనైన మాట్లాడలేదు.

జమీందారుగారి యింటిలో నారాయణరావుతో మాట్లాడునది యొక్క జమీందారుగారి యప్పగారు సుందరవర్థనమ్మ గారును, జమీందారుగారి బీద చుట్టములలో రంగమ్మగా రొకరును నారాయణరావన ఆపేక్షగానుండి గౌరవము చేయుచుండిరి. సేవకు లందరు నారాయణరావన భయముతో బ్రేమతో మెలగుచుండిరి. పరిచారికలతో జమీందారిణి అల్లునిగూర్చి నిరసనగా మాట్లాడునపు డెల్ల వారామె యెదుట మౌనము దాల్చుచుండిరి.

ఆ భవనమంతటిలో జమీందారుగారి తర్వాత నారాయణరావన్న ప్రేమ కురిపించునది కుమారరాజా కేశవచంద్రరావే. కేశవచంద్రుడు బావగారిని వదలడు. బావగారికడ భోజనమునకు గూర్చుండవలె. బావగారితో మాట్లాడవలె. బావమరిది నిద్రకు దనగదికి బోవునంతవఱకు కేశవచంద్రు డాతని కడనేయుండి, కబుర్లుచెప్పి యప్పుడు వెళ్ళి నిద్రపోవును. తనకడకుదక్క నితరులకడకు జనువుగా బోని కుమారుడు నారాయణరావునెడ సౌహార్ద్రముతో మెలంగుట జమిందారునకు నాశ్చర్య సం----------ను.

జమీందారుగారు నారాయణరావున కొక గదియు, పెద్దయల్లుని కొక గదియు, సుబ్బారాయుడుగారి కొక గదియు, స్త్రీజనమున కొక గదియు, మేనల్లు డానందరావుగారి కొక గదియు, నీరీతి వచ్చిన చుట్టము లందరి గదు లేర్పాటుచేసెను, గదులన్నియు బాగుగా నలంకరింపబడినవి. పడక