పుట:NagaraSarwaswam.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

89


నవదంపతులకది మిక్కిలి ఆనందాన్ని చేకూరుస్తుంది. వారిలో సంగమాశయాన్ని పెంపొందిస్తుంది. నవదంపతులయందేకాక కొంతకాలం వియోగాన్ని అనుభవించివున్న దంపతులయందుకూడ ఈ ఆలింగనం యేర్పడుతుంది. స్వేచ్ఛగా ఒకరినొకరు కలిసి అనుభవించుటకు అవకాశ ముండి పరిచయాధికతవలన లజ్జాదులు తొలగిన వారియం దీస్పృష్టకా లింగనము యేర్పడదు.

2. పీడితము :- పీడితము అనగా పీడింపబడినదని అర్ధము. భార్యాశరీరాన్ని భర్త తనశరీరముతో మిక్కిలిగా నొక్కి పీడించుట జరిగితే అది పీడితము అనే ఆలింగనము అనబడుతుంది. ఈ ఆలింగనముకూడ నవ వివాహితులయందే అధికముగా యేర్పడుతుంది. వారికి యౌవనోదయమైనప్పటికి పెద్దలు వారిసాంగత్యానికి ఇంకా యేర్పాటు చేయనపుడు ఏ తీర్థములయందో, ఏజనసమ్మర్ద ప్రదేశములయందో తోసిల్లినపుడు ఈ ఆలింగనం వారిమధ్య ఏర్పడే ఆవకాశంకలుగుతుంది.

అట్టి పరిస్థితులలో పురుషుడు భార్యమీది మక్కువతో ఆ సమ్మర్దములో భార్యవున్న చోటుకు ఎట్లోచేరుకొని-జనసమ్మర్దము కారణముగా అన్నట్లు ఆమెశరీరాన్ని ఏగోడకో ఆన్చి తనశరీరముతో మిక్కిలిగా పీడించుట జరిగితే-ఇట్లు ఒరసుకొని నిలచినవాడు భర్త అయినందున అతనిమీద తనకును ప్రేమ ఏర్పడి వున్నందున ఆ భార్య ఈ పీడితాలింగాన్ని ఏవో మధురభావనలు భావించుకొంటూ లజ్జతో అనుభవిస్తుంది.

స్వేచ్ఛగా ఒకరినొకరు పొందుటకు తగిన అవకాశమున్నవారు పీడితాలింగనమునకై యత్నింపరు.

3. లతావేష్టితము :- "లతావేష్టితము" అనగా లతవలె చుట్టబట్టుకొనుట. లోకంలో ఏమద్దిచెట్టు మొదటనో ఏదో ఒక లత బయలుదేరి ఆ చెట్టును చుట్టుకొంటూ క్రమంగా పైకి