పుట:NagaraSarwaswam.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆలింగన భేదములు


ఆలింగనము అనగా కౌగిలింత. కౌగిలి రతిలో తొలిమెట్టు వంటిది. ఆలింగనము వలన స్తీ పురుషుల శరీరము ఉద్రిక్తము అవుతుంది. వారు రతికి వున్ముఖులవుతారు. ఈ ఆలింగనములు అవియేర్పడే స్థితి భేదమునుబట్టి పదిరకములుగా వున్నాయి.

1. స్పృష్టకము :- 'స్పృష్టకము' అనగా తాకుట. ఆలు మగలు ఒకరినొకరు కేవలము తాకుటతో యేర్పడే ఆలింగనమైనందున దీనికీ పేరువచ్చినది. నవవివాహితులైన వధూవరులు ఒకరినొకరు గాఢముగా కౌగలించుకొనుటకు పెద్దలయెదుట తగినంత అవకాశము లేని వారైనపుడు, మనస్సులోని కోరిక ప్రబలంగా ఉన్నప్పుడు, యేదో పనిమీద ఇటునటు సంచరించుచునే ఒకరినొకరు రాసుకొని వెళ్ళుట లేక వచ్చుట ఆచరిస్తారు. ఇట్టిదైన శరీర సన్నికర్ష క్షణికమే అయినప్పటికి