పుట:NagaraSarwaswam.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88


డప్పుడు అబ్బా! అయ్యో! అన్నమాటలుకూడ పలుకుతారు. వీనిని బట్టి భార్యామానసంలో కోరిక సెగలు ఎగయిస్తోందని గ్రహించి పురుషుడు రతికి వుపక్రమించాలి.

అలా భర్తచే లాలింపబడిన వనితకు రతియందు తృప్తి తొందరలో కలుగుతుంది. అంతేగాదు, ఆమె అనుభవించే సుఖ పారవశ్యముకూడ ఎక్కువగా వుంటుంది. ఇట్లు భర్తచే లాలింపబడి సుఖించే వనిత భర్తను ప్రాణాధికంగా ప్రేమిస్తుంది. ఆమె భర్తకొరకు ప్రాణాలనుకూడ తృణప్రాయంగా అర్పించగలదై వుంటుంది చనిపోయిన మీదటకూడ ఆమె ఆపరలోకాలలో తనభర్త ఎక్కడ వున్నాడో వెదకికొని అక్కడకే చేరుకొంటుంది-అని ప్రాచీన కామశాస్త్రకారుల మాట. లాలించి రమించే భర్తపై వనితకు యేర్పడే అనురాగం ఇంతటిది. పురుషు డీవిషయమును గుర్తించి తాను సుఖించి ఆమెకు సుఖమును కల్పించాలి.


★ ★ ★