పుట:NagaraSarwaswam.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78

4 అత్యుచ్ఛరతి :- అశ్వజాతి పురుషుని పురుషాంగము పండ్రెండు అంగుళముల ప్రమాణముకలదైఉంటుదని వెనుక చెప్పబడినది. ఆ పురుషుడు యోనియొక్కలోతు కొంచెము తక్కువకాక బాగా తక్కువ, ఆరుఅంగుళములు మాత్రమే లోతుకల హరణీజాతి స్త్రీతో సంగమించినపుడు ఆరతి అత్యుచ్చరతి అనబడుతుంది. యోనికంటె పురుషాంగము రెట్టింపు ప్రమాణముకలదై ఉండుట దీనికి హేతువు. యీ అత్యుచ్చరతి యీ ఒక్కచోట మాత్రమే ఏర్పడుతుంది.

5 అతినీచరతి :- శశజాతిపురుషుని పురుషాంగము ఆరు అంగుళముల ప్రమాణముకలదై ఉంటుందని వెనుక చెప్పబడినది. అట్టి పురుషుడు తన పురుషాంగముకంటె రెట్టింపులోతు (పండ్రెండు అంగుళములు) యోనికలదైన హస్తినీజాతి స్త్రీతో కలిసి రమించినపుడు ఆ రతి అతినీచరతి అనబడుతుంది. ఇచ్చట యోనికంటె పురుషాంగము ప్రమాణములో మిక్కిలి చిన్నదికదా! అందుచేతనే ఇది అతినీచరతి అనబడినది. ఈరతిభేదము యీ ఒక్కచోట మాత్రమే ఏర్పడుతుంది.

ఇట్లున్న యీరతిభేదాలు మొత్తము తొమ్మిది రకాలుగా ఉన్నాయి.

సమరతి ఉచ్చరతి నీచరతి అత్యుచ్చరతి అతినీచరతి
హరిణీ-శశ 6-6 హరిణీ-వృషభ 6-9 బడబా-శశ 9-6 హరిణీ-అశ్వ 6-12 హస్తినీ-శశ
బడబా-వృషభ 9-9 బడబా-అశ్వ 9-12 హస్తినీ-వృషభ 12-9
హస్తినీ-అశ్వ 12-12

అయితే యీ రతులన్నిటియందు స్త్రీపురుషులకు ఉభయులకు సర్వధా సుఖాన్ని అందించే రతిఏది? అన్నప్రశ్న కలుగడం సహజం. దీనియొక్క సమాధానము తెలియుటకు ముందు స్త్రీయొక్క యోనిని గూర్చి కొంత తెలియాలి.