పుట:NagaraSarwaswam.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

77


దుచే వీరిరతి సమరతి అనబడుతుంది. ఇట్లే బడబాజాతి స్త్రీలకు, వృషభజాతి పురుషులకు మధ్యఏర్పడేరతి, హస్తినీజాతి స్త్రీలకు, అశ్వజాతి పురుషులకు మధ్య యేర్పడేరతి కూడ-సమరతులనియే అనబడతాయి. కారణము వారి గుహ్యాంగముల ప్రమాణము సమాణముగనుండుటయే, ఈవిధముగ యీసమరతి మూడురకాలుగా కానవస్తుంది.

2 ఉచ్చరతి :- హరిణీజాతిస్త్రీ తనతో సమానుడైన శశజాతి పురుషునితో గాక ఇంచుకమీదివాడైన వృషభజాతి పురుషునితో కలసినపుడు ఏర్పడేరతి ఉచ్చరతి అనబడుతుంది. ఎందువల్లననగా ఇచ్చట హరిణీజాతి స్త్రీయొక్క యోని ఆరు అంగుళములు మాత్రమే లోతుకలదికాగా అందు సంవిశితం చేయబడే వృషభజాతి పురుషుని పురుషాంగము తొమ్మిది అంగుళములు పొడవు కలదై వుంటుంది. యీ విధముగనే బడబాజాతి స్త్రీ తనకు సమానుడైన వృషభజాతి పురుషునితోగాక ఇంచుకమీదివాడైన అశ్వజాతి పురుషునితో కలిసి రమించినపుడు ఆ రమణముకూడ ఉచ్చరతి అనియే అనబడుతుంది. యోనికంటె పురుషాంగము పెద్దదగుటయే ఇచ్చటను కారణము. ఈ విధముగా ఉచ్చరతులు రెండురకాలుగా వున్నాయి.

3 నీచరతి :- శశజాతి పురుషుడు తనకు సమానమైన హరిణీజాతి స్త్రీతోకాక ఇంచుక మీదిదైన బడబాజాతి స్త్రీతో కలిసి రమించినపుడు ఆ రతి నీచరతి అనబడుతుంది. ఇచ్చట పురుషాంగము ఆరుఅంగుళముల ప్రమాణముకలదికాగా యోని తొమ్మిది అంగుళముల లోతుకలదై ఇంచుక పెద్దదైయున్నందున యీరతి నీచరతి అనబడినది. ఇట్లే వృషభజాతి పురుషుడు హస్తినీజాతి స్త్రీతో సంగమించగా ఏర్పడే రతికూడ నీచరతి అనియే అనబడుతుంది ఇచ్చటకూడ పురుషాంగముకంటె స్త్రీయొక్కయోని ఇంచుక ఎక్కువ లోతుకలదిగా నుండుటయే కారణము. యీవిధముగా నీచరతికూడ రెండురకములై ఉన్నది.