పుట:NagaraSarwaswam.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72


అనుగుణంగా భార్యకూడ ఆవేశంతో తన్ను ఆలింగనం చేసికొనేలా చెయ్యాలని అతని తాపత్రయం, ఆమెలోని కామాగ్నిని మండింపడానికై అతడేదేదో చేశాడు. కాని ఏం ప్రయత్నించినా ఆమెలోని కామాగ్ని లోలోపల ఏమిమండుతూవున్నదో కాని పైకి దానిజాడకనబడడంలేదు. అతని విషయం దీనికి భిన్నంగా ఉన్నది. భార్యామానసంలోని కామాగ్నిని దీప్తంచెయ్యాలని ప్రయత్నించినకొలది అతని మానసంలోని కామం సెగలెగయిస్తు విజృభించింది.

భర్తయొక్క ఉద్ధృతమైన ఆవేశాన్ని చూచి ఆమెనవ్వుతూ-ఇందాక అలుకవచ్చిందా? ఇప్పుడు అలుక తీరిందికాబోలు! నన్ను తాకనే తాకకు నాతోమాటాడకు అన్నారు. ఇప్పుడిదేమిటి? -అన్నది అనుగ్రహిస్తు. ఆభర్త చెప్పగల సమాధానంలేదు. అతడామెను పొదవుకొన్నాడు. ఆమె అనుగ్రహించిందికదా? వారిరువురు గాఢాలింగనంలో ఏకీకృత శరీరులయ్యారు.

ఇదికో! జిబ్బోకం అనేచేష్ట ఈవిధంగావుంటుంది.

యీ శృంగార చేష్టలన్నిటిని గూర్చిన ఎఱుకనాగరకులుగా మనగోరే-స్త్రీ పురుషులకు మిక్కిలి వుసరం. దీనివలన వారు తమ ప్రియులయందు శృంగార భావం ఏ స్థాయిలో వున్నదో అన్నవిషయము తెలిసికొని వర్తించగలుగుతారు.

★ ★ ★