పుట:NagaraSarwaswam.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్త్రీ పురుష జాతిభేదములు


లోకంలో స్త్రీజాతి ఉన్నది. పురుషజాతి ఉన్నది. " స్తనకేశ సత్ స్త్రీస్యాత్ లోమశః పురుషః స్మృతః " అన్నారు. అనగా స్తనములు, కేశములు స్త్రీజాతిలక్షణాలు. రోమసంపద (గడ్డము, మీసము) పురుషలక్షణములు. యిలారెండుగావున్న యీజాతులయందు ప్రధానలక్షణాలు సమంగావున్న కొన్ని కొన్ని తేడాలు కనబడుతూ వుంటాయి. ఆతేడాలనుబట్టి యీ రెండుజాతులను తిరుగ మూడేసి తెగలుగా విభజించారు.