పుట:NagaraSarwaswam.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

150


తాముకోరే పురుషునిగూర్చి వినడానికి వీరు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు.

ఈవనితలు పరపురుషుని ఎదుట ఆవులించి, ఒడలు విరచుకొని, చేతివ్రేళ్ళు మెటికలు విరుస్తారు. లేని శ్లేష్మం నోటిలోనికి తెచ్చుకొని గొంతు సవరించుకొని ఉమ్మి వేస్తారు. పనిలేనిదే చెవులలో వ్రేళ్ళు పెట్టుకొని త్రిప్పుకొంటూ పరపురుష సన్నిధియందు సంచరిస్తారు. చిరునవ్వులు చిందిస్తారు. తీయగా మాట్లాడుతారు. ప్రేమగాచూస్తారు. ఇవన్నీ సులభసాధ్యలైన స్త్రీల చేష్టలు.

ఇట్టి చేష్టలు పరపురుషుని ఎదుట ఆచరింపబడితే ఆపురుషుడా వనిత తనకు సులభసాధ్య అని గ్రహించాలి. కాని ఒక్క విషయం. కొందరు ఏమీ తెలియక అమాయకంగానే మనస్సులో ఏగూఢార్థము లేకయే ఈపనులు ఆచరింపవచ్చును. అట్టిచోట పురుషుడు ఆలోచన లేక ప్రవర్తిస్తే ప్రమాదం తప్పదు, అందుచే చాలా నిదానించికాని పురుషుడొక నిర్ణయానికి రాకూడదు.

2. ప్రయత్న సాధ్యలైన స్తీలు

ఈపైన చెప్పిన లక్షణాలు లేకపోయినా భర్తవలన తగినంత సౌఖ్యంలేని స్త్రీలు కొంత ప్రయత్నంతో పరపురుషునకు వశమవుతారు. అనగా నిరంతరవ్యాధి పీడితుని భార్య, అసూయపరుని భార్య, దుష్టుని భార్య ప్రయత్న సాధ్యలై ఉంటారు. ఎల్లప్పుడు ఏదో వ్యాధితో బాధపడేవాని భార్యకు భర్త వలన సుఖమేముంటుంది ! ఈక అసూయాపరుడైనవాడు శారీరకంగా దృఢంగాఉన్నా అసూయాలక్షణంచేత భార్యామనస్సుకు నొప్పికలిగిస్తూ ఉంటాడు. దుష్టుడైనవాడు కలిగించిన బాధ ఏమున్నది గనుక ! అందుచే ఈ మూడు పరిస్థితులయందు తమభర్తయొద్ద పొందజాలని సుఖాన్ని పొందడానికై యువతులైన వనితలు తమంతతాము కాకపోయినా ఎవరయినా భయంలేదంటూ చేయిపట్టుకొని నడిపిస్తే కొంతజంకుతూ కొంతఏదో తెలియని ఆనందాన్ని అనుభవిస్తూ పెడదారి త్రొక్కడానికి అంగీకరిస్తారు. వీరు మువ్వురేకాక మాటిమాటికీ తీర్థయాత్రలు, ప్రయా