పుట:NagaraSarwaswam.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144


ఉండుటవల్ల ఆతనిహృదయానురాగాన్ని పొందగలుగుతుంది. స్త్రీలకు సిగ్గు సహజాభరణం. అందుచే పతి ఎరుగని రహస్యములు తనయొద్ద లేకపోయినను స్త్రీ లజ్జాగుణాన్ని విడువకూడదు. అట్టి లజ్జాప్రదర్శనం వల్ల పతియొక్క మనస్సు ఆనందతరంగితం అవుతుంది. నిర్లజ్జ సిగ్గులేనిది) అయిన వనితయందు పురుషునకు విరక్తికలుగుతుంది. అందుచే పతి ఎదుటకూడ వనిత సిగ్గువిడచి ఎన్నడును చరించకూడదు. సంతతము చిరునవ్వుతో కూడిన ముఖముకలదై నాజూకైన వస్త్రధారణంద్వారా అల్పంగా మాత్రమే గోచరించే శరీరముకలదై లజ్జావతియైన వనిత పతియొక్క మానసాన్ని ఆకర్షించ గలుగుతుంది. పతిఎదుట చిరునవ్వును విడచి కోపమును, దుఃఖమును ప్రదర్శించే వనితలు భర్తయొక్క అనురాగావేశాన్ని కూడ సంపాదించలేరు.

చిరకాలమునుండి తాను పతితో కలసి కాపురముచేస్తూ ఉన్నా ఆపతి రతిక్రీడయందాసక్తిచూపినప్పుడు వనిత వెంటనే అంగీకరించరాదు. ఆ సమయమునందామె తన శరీరాన్ని ముడుచుకొని, కొంతసిగ్గును, కొంతభయమును, కొంత వ్యతిరేకతను ప్రదర్శించుటద్వారా మాత్రమే పతియొక్క మనస్సులో అనురాగాన్ని దీప్తం చేయగలుగుతుంది.

ఇక రతిక్రీడ ఆరంభమైనమీదట వనిత అంతవరకు ప్రదర్శించిన సిగ్గును వ్యతిరేకతను కొంతవరకు విడచిపెట్టి తనయొక్క శరీరాన్ని భర్తకు అర్పించాలి. ఆ అర్పించుటలో ఆతనిమీది ప్రేమవలన తాను దీనికి (రతికి) ఒడబడుతూ ఉన్నట్లుండాలేకాని, తానే రతిని కోరుతూ ఉన్నట్లు ఉండకూడదు. సంభోగసమయంలో భర్త ఆవేశముతో తనయొక్క ఏ శరీరభాగాన్ని చూడగోరినా లేక నఖక్షత దంతక్షతము లాచరింపగోరినా ఆ శరీరభాగాన్ని ఆతనిదృష్టికి చేతులకు అందకుండ తప్పించి , ఆతనిని కవ్వించి అందించాలేకాని కోరినంతనే అందీయకూడదు.