పుట:NagaraSarwaswam.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

143


కాంతల ఏకాంత ధర్మాలు

ఇంతవరకు వివిధ భేదములతోకూడిన కామక్రీడా విధానములన్నియు తెలుపబడ్డాయి. పురుషుడు ఈ శాస్త్రమునందెంత పండితుడైనా భార్యయొక్క అనురూపాచరణం వల్లనే ఆతనియందు ఉత్సాహం జనిస్తుంది. అప్పుడాతడు తనానందించి ఆమెను ఆనందింపజేయ గలుగుతాడు. భార్యయొక్క నడవడి, ఆమెచేతులు, అతనిమనస్సులో ప్రేమోత్సాహాలను జనింపచేయలేకపోతే అతడామెయందు తగినంత అనురాగం ప్రదర్శింప జాలనివాడవుతాడు. ఫలితంగా ఆలుమగల దాంపత్యం రసహీనంగా ఉంటుంది. అందుచే ఏకాంతంలో భర్తయొక్క మానసాన్ని ఆకర్షించడానికి కాంతలు ఆచరింపవలసిన పనులు ఈ ఉపకరణంలో తెలుపబడుతున్నాయి.

తనభర్తయొక్క మనస్సును ఆకర్షించాలని, అతనియొక్క పరిపూర్ణ ప్రేమానురాగాలకు తాను పాత్రం కావాలని ప్రతివనిత కోరుకొంటుంది. అలా భర్తయొక్క ప్రేమానురాగలను వాంఛించే వనిత అన్నిపనులు భర్తమనస్సుకు అనుకూలంగా ఆచరించాలి. భర్తకు అనిష్టమైన పనిని ఆచరించుట, ఇష్టమైన పనియందు అనాదరము చూపుట భార్యకు తగదు. ఆమె ఎల్లవేళల స్వచ్ఛమైన వస్త్రాలను నాజూకుగా ధరించాలి. అందున పతిని కలిసే ఏకాంతసమయంలో ఆమె వస్త్రాధారణం స్వచ్చతాపూర్ణమై - నాగరకతతో కూడినదై ఉండుట మిక్కిలి అవసరము. ఆమె నాగరకులు తమశరీరాలు అలంకరించుకొనే విథానాలయందు నేర్పుగడించి శరీరాలంకరణములో శ్రద్దకలదై ఉండాలి. ఆమె వేషాలంకారాలలో పల్లెటూరివారి అసహ్యకరములైన లక్షణాలు కనిపించకూడదు. ఆమెభర్త మనస్సుకు నొప్పితోచేమాటలు నెన్నడును పలుకక మధురభాషిణియై ఉండాలి.

పతియెదుట పత్నికి భయభక్తులే శోభాజనకాలు. ఆమె పతియందును రాగముతోబాటు భీతినికూడ తగుమాత్రంగా ప్రదర్శిస్తూ లజ్జాశీలయై