పుట:NagaraSarwaswam.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

127


షుని పురుషాంగమునుండి బయటకు వస్తుంది. అట్లు వీర్యము విస్సృతమైనపిమ్మట పురుషాంగమునందు శిధిలత ఏర్పడుతుంది.

పురుషుడు రతిక్రీడకు అభిముఖుడైనపుడాతని పురుషాంగము ఉత్థితం అవుతుంది. దానివలన అతని రతిక్రీడాభిముఖత, ఆతనిలోని ఆవేశము వ్యక్తం అవుతాయి. కాని ఈవిధంగా స్త్రీయొక్క రతిక్రీడాభిముఖతను సూచించే లక్షణములేవీ బయటకు కనబడవు అయినను యోనియందు పురుషాంగము ప్రవేశించినంతనే వారియందు కూడ రతిక్రీడాభిలాష జనిస్తుంది.

ఇక సంభోగసమయమున పురుషుని ఆనందమునకు స్థానము ఆతని పురుషాంగముయొక్క అగ్రభాగమే అయిఉండాగా వనితకు గర్భాశయముఖము ఆనందస్థానమై ఉన్నది. ఆ గర్భాశయ ముఖము చించాప్రసూనము (చింతపూవు) వలె ఉంటుంది. పురుషాంగముయొక్క అగ్రభాగము ఆ గర్భాశయ ముఖమును తాకినంతనే వారికి కలుగు ఆనంద పారవశ్యము ఇంత అని చెప్పడానికి వీలులేనిదై ఉంటుందని ' రతికల్లోలిని ' అనే ప్రాచీన కామశాస్త్రకర్త అభిప్రాయమై ఉన్నది.

సంభోగారంభదశయందు భార్యతో రతికి తగిన ఆవేశమును కలిగించుటకు మదనచ్ఛత్రమును చేతితో కలచవలెనని వెనుక చెప్పబడినది. అట్లు కేవలము వ్రేలితో మదనచ్ఛత్రమును కలచుటయేకాక పురుషుడు తనచేతివ్రేళ్ళను భార్యయొక్క యోని యందు ప్రవేశపెట్టుటకూడ జరుగుతుంది. దానికి అంగుళీ ప్రవేశమనిపేరు. అది యీ దిగువ వివరింపబడుతోంది.