పుట:NagaraSarwaswam.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126


శ్లో. అశ్లేషం ప్రధమం కుర్వాత్ ద్వితీయం చుంబనం తధా!
    త్వతీయం నఖఘాతశ్చ దంతఘాత శ్చతుర్ధకమ్!
    క్షేపణం పంచమం ప్రోక్తం షష్ఠం ప్రహరణం తధా
    సప్తమం కంఠ శబ్దశ్చ వధ్వాఖ్యం చాష్టమం రతమ్!

అనగా మొదట ఆలింగనము, తరువాత చుంబనము. చుంబనమునకు పిమ్మట నఖక్షతము, దాని తరువాత దంతక్షతము. ఈ నాలుగు ఆచరింపబడినమీదట ఐదవక్రియ పురుషాంగము యోనియందు సంవిశితము చేయుటయై ఉన్నది. ఆరవది ప్రహరణము. ప్రహరణము అనగా కొట్టుట. ఆలుమగలు రతిక్రీడ నాచరించేవేళ హేలగా పురుషుడు భార్యను కొట్టుటకూట (అనగా గట్టిగా కాదు) జరుగుతుంది. దానికే ప్రహరణ మనిపేరు. సంభోగము ఆరంభము కాకపూర్వమే పురుషుడు భార్యను ప్రహరించుట కూడదు. అట్లాతడు ప్రహరించినమీదట భార్య తనకు నొప్పి తోచినను తోచకున్నను 'అబ్బ! అమ్మా! ఇస్ ' ఇత్యాది ధ్వనులను ఆచరిస్తుంది. వీనికి కంఠశబ్దములనియు నిరుతములనియు పేరు. ఈ కంఠశబ్దములు ఏడవక్రియగా ఆచరించబడాలి. ఆలుమగలు ఈ క్రమాన్ని గుర్తించి రతిక్రీడాపరులై ఆనందించాలి.

ఇక్కడ వేరొక విషయము కూడ తెలిసికొనవలసి ఉన్నది. పురుషుని రతిక్రీడాదక్షతకు అతని వీర్యము కారణము. మానవుడు స్వీకరించు ఆహరము మొదట రసముగా మారుతుంది. ఆ రసమే నెత్తురుగా మారుతుంది. నెత్తుటినుండి మాంసము, మాంసమునుండి మేధస్సు, మేధస్సు నుండి మజ్జ, మజ్జనుండి ఎముక, ఎముక ద్రవించి వీర్యము జనిస్తాయి. రస - రుధిరమాంస మేధస్ - మజ్జా - అస్థి - వీర్యములనే ఈ ఏడింటికి ఏడు ధాతువులనిపేరు. ఈ ఏడు ధాతువులయందు ఉత్తమమైనది వీర్యము. ఈ వీర్యము పురుషుని అండములయందు జనిస్తుంది. సంభోగ సమయమునందీ వీర్యము పురు