పుట:NagaraSarwaswam.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

125


చుంబన - దంతక్షత - నఖక్షతాదుల నాచరించుటకు సౌకర్యం ఎక్కువగా ఉండి రతిక్రీడ ఆనందప్రదం అవుతుంది.

ఇక ఉత్థాతకరణములు క్లేశకరములగుటయేకాక తగినంత నేర్పులేక ఆచరించుట వలన రోగకారకములుకూడ అయిఉన్నాయి. అందుచే వానిని లోకము ఎక్కువగా ఆచరింపదు.

ఐదవదైన వ్యానతకరణము లేక పశుకరణము స్త్రీ తనయొక్క కటిభాగమును మిక్కిలిగా సంచలింపజేయుటకు, యోని ముఖమును మిక్కిలిగా వెల్లడించుటకు వీలు కలదగుటచే స్త్రీ యోనికంటె పురుషాంగము చిన్నదైన నీచరతులయందు ఆనందప్రదం అవుతుంది.

రతిక్రీడయందు పురుషుడు అలసినపుడు స్త్రీ పురుషునిమీద అధిరోహించి స్వయముగా పురుషునివలె ప్రవర్తిస్తుంది. దీనిని ' పురుషాయితము ' అంటారు.

ఈ చెప్పబడిన వానికంటె భిన్నములైన రతిభేదములు ఎన్నియో ఉన్నాయి. అవి ఉత్తమములు కాకుండుటచే నాగరకజనం వాని యందాసక్తి చూపరు. అందుచే అవి యిందు పరిహరింపబడ్డాయి. కాని ఏకరణభేదమును అవలంబించినా పురుషుడు క్రమం తప్పకూడదు.

శ్లో|| దర్శనేన రతిం కృత్వాస్త్రియః స్పర్శన మాచరేత్ |
    స్పర్శేన ద్రవ ముత్యాద్య శవై స్సంభోగ మాచరేత్ ||

అనగా పురుషుడు స్త్రీవంకకు చూచే చూపులోనే ఆమెకు తనయందు ప్రీతి కలిగించాలి. అలా ప్రీతి కలిగించిన మీదటనే ఆమెను స్పృశించాలి. తనయొక్క స్పర్శచేతనే ఆమె యోనియందు ద్రవించేలా స్పృశించాలి. అనంతరం నెమ్మదిగా సంభోగానికి ఉపక్రమించాలి. ఇది క్రమం. ఈ క్రమం తప్పకూడదు. మరియొక క్రమం కూడ చెప్పబడ్డది.