పుట:NagaraSarwaswam.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110


జరిగినను ఆ సమయంలో స్త్రీయందు గర్భోత్పత్తికి అనుకూలమైన స్థితి ఏర్పడక పోవచ్చును. ఇట్టిది అరుదుగా ఏర్పడి లోకమునందు సహజంగానే నపుంసకుల జననం అరుదుకావడానికి కారణమైఉంటుంది.

పైనచెప్పిన నాడిభేదమును గుర్తించి వర్తించే పురుషునకు పుత్రీ పుత్ర ప్రాప్తులేకాక స్త్రీకుడ వశవర్తిని అవుతుంది. ఆమె ఎంతగా వశవర్తిని అవుతుందంటే ఆమె ఎన్నడును పరపురుషుని వాంఛింపదు. ఈ నాడీభేదము నెరిగి తన్ను తృప్తిపరచిన భర్త కాలాంతరంలో శరీరములోని సత్తువ నశించి నపుంసక స్థితివంటి స్థితిని పొందినప్పటికి ఆమె హృదయ మాతనియందు మాత్రమే లగ్నమై అన్యపురుషుల యందు విరక్తమై ఉంటుంది. అందుచే ఈ నాడీ పరిజ్ఞానము సర్వులకు అవసరమై ఉన్నది.


★ ★ ★