పుట:NagaraSarwaswam.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

109

ఆ కొందరి అభిప్రాయము ననుసరించి సతీనాడికి స్త్రీయొక్క స్తనములును, అసతీనాడికి చంకలును, సుభగానాడికి పెదవులును, దుర్భగానాడికి వెన్నుపూస తుదిభాగమును, పుత్రీనాడికినోరును, దుహిత్రిణీనాడికి నితంబమును (పిరుదులు) స్థానములై ఉన్నాయి.

ఈ మతము ననుసరించి పురుషుడు సతీనాడీచోదనము చేయదలచినపుడు భార్యయొక్క స్తనములను మర్దింపవలెను. అసతీనాడిని ప్రేరేచదలచినపుడు చంకలయందు నఖక్షత మాచరింపవలెను. (ఇట్లు ఆచరించినపుడు కులస్త్రీలకు, కులటలకు అధికానందము కలుగుతుందో వ్యత్యస్తమైనపుడు వారియందా ఆనందము కొంత లోపించునేకాని వారా పురుషుని ద్వేషించుట జరుగదని-ఈ మతమువారి అభిప్రాయముగా గ్రహింపవలెను.) సుభగానాడీచోదనము చేయదలచినపుడు పెదవులను ముద్దిడుకొనవలెను. దుర్భగానాడిని ప్రేరేచదలచినపుడు వెన్నుపూస తుదిభాగమును చేతితో మర్దింపవలెను. జిహ్వ ప్రవేశముచే పుత్రీనాడిని, పిరుదులను మర్దించుటచే దుహిత్రీనాడిని ప్రేరేచవలసిఉంటుంది. ఇది మతాంతరము.

వనితయొక్క యోనిలో అధోభాగమునందున్న పుత్రీ దుహిత్రిణీ నాడులకు రెండింటికి పురుషుడు తన పురుషాంగముచే ఏకకాలమున ప్రేరణ కలిగించుట జరిగి ఆ సమయమునందే స్త్రీ గర్భమును ధరించే స్థితి ఏర్పడితే ఆమెకు నపుంసకుడు జన్మిస్తాడు.

అయితే లోకంలో అందరకును ఈ నాడీభేదం అసగతం అయినందువల్లనే పుత్రులు లేక పుత్రికలు జన్మించడం జరుగుతూ ఉన్నదా? అన్న శంక అసహజం కాదు. ఈ నాడీభేదం తెలియకపోయినా స్త్రీ పురుషులు సంగమవేళ ఈనాడుల యందేదో ఒకదానికి మాత్రమే ప్రేరణ కలుగుట, గర్భధారణ జరుగుట, పుత్రుడో పుత్రికయో జనించుట జరుగుతూ ఉంటుంది. ఉభయనాడులకు ఒకే సమయంలో ప్రేరణ అనేది ఎప్పుడో, ఎక్కడనోకాని జరుగని కృత్యం. అట్టిది