పుట:NagaraSarwaswam.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

99


నఖక్షతములు :

నఖము అనగా గోరు. క్షతము అనగా గాయము. ప్రియురాలి యొక్క శరీరమున కాంతి మంతములై మాంసలములైన భాగములను భర్త కేవలము స్పృశించి, ముద్దు బెట్టుకొని తృప్తి చెందక ఆయా మాంసల భాగాలను గోళ్ళతో సన్నగా నొక్కి తృప్తి చెందే వాడై ఉంటాడు. అట్టివైన గోటి నొక్కులకే నఖక్షతములని పేరు. భర్త తన యొక్క శరీరమును జూచి ఆవేశముతో నఖక్షతము లాచరించినపుడు భార్యయందు రతికి సుముఖమైన ఆవేశము కలుగుతుంది. అయితే ఈవిధంగా భార్యా శరీరముపై నఖక్షతముల నాచరింపగోరు పురుషుడు తన గోళ్ళను మిక్కిలి శుభ్రంగా ఉంచుకొనాలి. వాని యందు పొరలు, మాలిన్యము లేకుండా చూచుకోవాలి. లేకున్నచో అతని గోటిలోని మాలిన్యము ప్రియురాలి నెత్తుటియందు ప్రవేశించి పుండుపడవచ్చును. ఈ నఖక్షతములు మొత్తము ఎనిమిది రకములుగా ఉన్నాయి.

1. ఉచ్ఛురితము :- భార్యయొక్క స్తనములయందు, బుగ్గలయందు లేదా చెంపల యందు ప్రియుడు తనచేతి గోళ్లు ఐదింటితోడను ఆమె శరీరము గగుర్పాటు చెందునట్లు, వీణవాయించినట్లు రేఖలు స్పష్టంగా గోచరింపనటులు గీరినచో అది ఉచ్చరితము అనబడుతుంది. గోళ్ళయొక్క యీవిధమైన అల్పస్పర్శవలన ఆమెయొక్క శరీరం పులకిస్తుంది. సాధారణంగా లోకంలో అందరకు వెన్నుపూసమీద పొడవుగా వ్రేలితో అల్పస్పర్శ కలిగించినపుడు చక్కిలి గింతవంటి స్థితి ఏర్పడి నాడీమండలమునందొక వింత కదలిక ఉదయిస్తుంది. అట్లేప్రియా శరీరమున గూడ ఉచ్ఛరిత నఖక్షతము అల్పస్పర్శతో ఆచరింపబడి ఆమె శరీరమును జలదరింప జేస్తుంది.

2. అర్ధచంద్రము :- అర్ధచంద్రము అనగా సగమైయున్న చంద్రునివలె వంకరగా నున్నది అని అర్ధము. ప్రియుడు ప్రియురాలి మెడమీద, స్తనములమీద అర్ధచంద్రాకృతి ఏర్పడునట్లు గోటితో