పుట:NagaraSarwaswam.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

95


వరకు రతిక్రీడా విషయమున ఉదాసీనురాలైనప్పటికి ఆ భార్యయందు తీవ్రమైన ఉత్కంఠ ఏర్పడుతుంది.

4. స్ఫురిత చుంబనము :- అంతవరకు తనయౌవనమును ఎక్కడను కొల్లబెట్టనివాడైన పురుషుడు నిష్కరిచుకము, నిశ్చేలము (రవికలేనిది, చీరలేనిది) అయిన భార్యశరీరాన్ని తొట్ట తొలిసారి చూచినపుడు విభ్రాంతుడవుతాడు. అతని శరీరంలో ఆవేశము పట్టరానిదిగా ఉంటుంది. ఆ ఆవేశములో అతని సర్వశరీరము కంపిస్తుంది. అనగా అదురుతుంది. ఈ కంపలక్షణము అతని చేతివ్రేళ్ళ కొనలయందు, పెదవులయందు స్ఫుటంగాకనిపిస్తుంది.

అట్టిసమయమునందు పురుషుడు తన అదరుతూఉన్న పెదవులను భార్యయొక్క బుగ్గలమీద స్తనములమీద ఉంచుటజరిగితే భార్య యొక్క సర్వశరీరము పులకిస్తుంది. ఇట్టిదైన చుంబనమునకు స్ఫురిత చుంబనము అని పేరు. స్ఫురణము (అదరుట) తోడి యీ చుంబనము, నవదంపతులయందేకాక దీర్ఘకాలవియోగాన్ని అనుభవించి కలసికొన్న దంపతులమధ్యకూడ ఏర్పడుతుంది. రతిరహస్యమునందే చుంబనము భిన్నముగా చెప్పబడినది. "మహామునీనాం మతయోపి బిన్నాః". చూ రతిరహస్యం.

5. సంహతోష్ఠము :- భార్యయొక్క హృదయభాగమున, మొలయందు, తొడలయందు స్ఫురిత చుంబనమునందువలెనే పెదవులను రెంటిని దగ్గరగాచేర్చి కొంత గాఢముగ చేయబడిన చుంబనము 'సంహతోష్ణము' అనబడుతుంది. స్ఫురిత చుంబనమునందు అదురుచున్న పెదవులు రెండును దగ్గరగా చేర్చబడవు. మరియు దానియందు మిక్కిలి అల్పమైన స్పర్శ ఏర్పడుతూంది. ఈ చుంబనమునందట్లుకాక, పెదవులు రెండును సంక్లిష్టములై ప్రవర్తించుట, గాఢత అనే రెండు లక్షణాలు ఉంటాయి. దగ్గరగాచేర్చబడిన పెదవులతో చేయబడిన చుంబనమైనందున ఈ చుంబనమునకు సంహతోష్ఠము అని పేరు.