పుట:NagaraSarwaswam.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

6. వైకృతికము  : ప్రియురాలు తనయొక్క పార్శ్వ భాగమున కూర్చుండి యుండగా ఆమెను తనయొడిలోనికి అడ్దముగా వంచి ఆమెయొక్క బుగ్గలను, కంఠమును, కుచములను చుంబించుట వైకృతిక చుంబనము అనబడుతుంది, "వైకృతము" అనగా వ్యతిరేకముగా చేయబడినది. భార్యాభర్తలు ఒకరికొకరు ఎదురు ఎదురుగా నున్నపుడు జరుగు చుంబనము సహజము. ఆట్లు కాక భార్య అడ్డముగా పురుషుడు నిలువుగా ఉన్నప్పుడు చేయబడు చుంబనమైనందున దీనికి "వైకృతిక" మని పేరేర్పడును.

7. నతగండచుంబనము :- భర్త శయనించిన శయ్య యొక్క పార్శ్వభాగమునకు భార్యవచ్చి నిలచు ఉండగా-శయనించినవాడై యున్న ఆభర్త ఆమెయొక్క ముఖమును బాగుగా వంచి ఆమె బుగ్గలను చుంబించినచో అది 'నతగండము' అనబడుతుంది. నతము-అనగా వంచబడినది. 'గండము' అనగా బుగ్గ. ఈ చుంబనమునకు బుగ్గలే ప్రధానస్థానమైనను భార్యయొక్క సర్వశరీరము ఈ చుంబనమునకు తగినదే అని శాస్త్రకర్తల అభిప్రాయము. అయినను ప్రధానస్థానము బుగ్గలగుటచే దీనికి 'నతగండము' అను పేరు వచ్చినది.

ఇంతవరకు చెప్పబడిన యీ ఏడు చుంబనములు నిశ్శబ్దచుంబనములు అనబడతాయి. వీనియందు ధ్వని ఉండదు. ఉన్నను అది మివుల అల్పంగా ఉంటుంది. సశబ్దచుంబనములు ధ్వని ప్రధానంగా సాగుతాయి. అవికూడ సంఖ్యచే ఏడుగానే ఉన్నాయి.

సశబ్ద చుంబనములు

1. సూచీచుంబనము : సూచి అనగా సూది. ప్రియుడు తన నాలుక చివరను సన్నగా నుండుంట్లొనరించి ప్రియురాలి పెదవుల గుండా ఆమె నోటిలో సూదిదూర్చినట్లు దూర్చుట జరిగినచో అది