పుట:NagaraSarwaswam.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94


నిశ్శబ్ద చుంబనములు

1. నిపీడితచుంబనము :- భార్యాస్తనద్వంద్వాన్ని నాభీదేశాన్ని కొలదిగా నొక్కుతూ ఉన్నవాడై భర్త ఆమెయొక్క పెదవులపై పెదవులు ఉంచితే అది "నిపీడితచుంబనము" అనబడుతుంది. ఇందు భర్తయొక్క గాఢస్పర్శ నాభీదేశమున, స్తనముల యందు అనుభవించుటయేకాక అతని ముఖగంధములతోబాటు ఆతని పెదవులు తనపెదవులపై వచ్చినిలచుటతో భార్యయొక్క నాడీమండలము రతికి అభిముఖమైన ఆవేశముతో ఒక్కసారిగా కదలిక పొందుతుంది. 'నిపీడితము' అనగా పీడింపబడినది. నాభి స్తనములు పీడింపబడిన మీదట జరిగే చుంబనం అయినందున దీనికీపేరువచ్చినది.

2. భ్రామిత చుంబనము :- భ్రామితము అనగా త్రిప్పబడినది. ప్రియురాలు ఏదోపనిచేయుచుండగా భర్త ఆమెకు వెనుకగా వచ్చి చేతులతో ఆమె ముఖమును వెనుకకుత్రిప్పి ఆమె నొసటి యందు లేదా పెదవులయందు ముద్దుపెట్టుకొనుట జరిగితే అది "భ్రామితచుంబనము" అనబడుతుంది. సహజంగా తాను అభిముఖంగా నిలచివునప్పుడుకాక, ఏదోపని చేసుకొంటూ ఉండగా ఆకస్మికంగా వెనుకకువచ్చి ఆవేశంతో కొంత బలాత్కారంగా భర్త తనను చుంబించినపుడు ఆప్రియురాలి మనస్సులో, శరీరములో ఒక వింతకదలిక మెరపువలె మెరుస్తుంది. ఇట్టి యీచుంబనమునకే భ్రామిత చుంబనము అనిపేరు.

3. ఉన్నమిత చుంబనము :- ఉన్నమితము అనగా ఎత్తబడినది. ప్రియురాలు తలవంచుకొని ఉండగా ప్రియుడామెను సమీపించి ఒకచేతితో గడ్డమును, ఒకచేతితో శిరస్సును పట్టుకొని ఆమె ముఖమును పై కెత్తి-ఆమెయొక్క నేత్రములయందు (కనురెప్పలమీద) బుగ్గలమీద చుంబించుట జరిగినచో అది ఉన్నమిత చుంబనం అనబడుతుంది. భర్త ఆచరించిన ఇట్టి చుంబనమువలన అంత