పుట:NagaraSarwaswam.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

93


చుంబన-నఖక్షత-దంతక్షతాదులు బాహ్యరతి అనబడతాయి. చుంబనం అనగా ముద్దు, అత్యధికమైన ఆకర్షణకలచోట యీచుంబనం తనంతతానుగా ప్రవర్తిల్లుతుంది. భార్యాసౌందర్యముచే ఆకృష్టుడై భర్త ఆమెను చుంబించినపుడు-అంతవరకు ఏవిధమైన ఆవేశమును పొందనిదైనప్పటికి ఈ చుంబనముతో ఆభార్యయొక్క నాడీమండలములోకూడ రతికి అభిముఖమైన స్పందనము, ఆవేశము ఏర్పడతాయి.

కాముకుడైన పురుషునకు భార్యయొక్క సర్వశరీరము చుంబించదగినదిగానే తోస్తుంది. అయినా శరీరంలో స్పర్శగుణం ఎక్కడెక్కడ అధికంగా ఉంటుందో అక్కడక్కడ చేయబడిన చుంబనములే యోగ్యమైన ఫలితాన్ని యిస్తాయి. ఆవిధంగా స్థానభేదమును బట్టి నిశ్శబ్దము, సశబ్ద అయిన క్రియనుబట్టి చుంబనభేదాలు ఏర్పడతాయి. ముద్దుపెట్టుకొనుటయందు పెదవులయొక్క స్పర్శయేకాని ధ్వని ఉండని చుంబనములు నిశ్శబ్ద చుంబనములనియు, ధ్వనితో కూడిన చుంబనములు సశబ్ద చుంబనములనియు చెప్పబడతాయి.

ఆలుమగలలో కామభావము పరమ తీవ్రముగా ఉన్నప్పుడు వారి చుంబనములు నిశ్శబ్దముగానే సాగుతాయి, అనగా ఒకరి ముఖముపై నొకరి ముఖమును పెదవులను ఉంచుకొని నిశ్శబ్దముగానే నిట్టూరుస్తూ పారవశ్యాన్ని పొందేవారు అవుతారు. ఒకవేళ వీనియందు ధ్వనియేర్పడినను అది మిక్కిలి అల్పమై గణనకు రానిదై ఉంటుంది. అట్టిచుంబనములు నిశ్శబ్దచుంబనములు అనబడతాయి. ఇక ధ్వని ప్రధానముగా సాగే చుంబనములు సశబ్ద చుంబనములు అనబడతాయి. వానిలో మొదట సశబ్ద చుంబనములు వివరింప బడుతూ ఉన్నాయి. ఇవి మొత్తం ఏడురకాలుగా ఉన్నాయి. నిశ్శబ్ద చుంబనములు :-

★ ★ ★