పుట:Naa Kalam - Naa Galam.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పేరు చివర ఎలా చేర్చారని రాజీవ్‌ సందేహం!

"నిజమే! కాని, పూర్తి పేరు - జవహర్‌లాల్‌ నెహ్రూ - అన్నది పెట్టకపోతే, ఆ మహనీయుడు జవహర్‌లాల్‌ ఎలా జ్ఞాపకం వస్తారు? మహాత్మాగాంధి పేరు పెట్టదలచుకున్నవారు "గాంధి" వదిలిపెట్టి వట్టి "మోహన్‌దాస్‌" అని మాత్రమే (గాంధీజీ అసలు పేరు) పెట్టుకుంటే, ఆ మహనీయుడు ఎలా జ్ఞాపకం వస్తాడు?" అని నేను వివరణ ఇచ్చాను. రాజీవ్‌గాంధి చిరునవ్వు నవ్వారు!

ముగ్గురు వివాహాలకు ముగ్గురు ప్రధానుల సందేశాలు

మా ఇంటిలో వివాహాలకు ఒక ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. పండిట్‌ నెహ్రూ, శ్రీమతి ఇందిరాగాంధి, శ్రీ రాజీవ్‌గాంధి ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల మహా నాయకులు; ప్రధాన మంత్రులు కూడా.

కాగా, నా వివాహానికి ప్రధాని నెహ్రూ, నా కుమార్తె ప్రేమజ్యోతి పెళ్లికి శ్రీమతి ఇందిరాగాంధి, నా కుమారుడు వివాహానికి శ్రీ రాజీవ్‌గాంధి శుభసందేశాలు పంపడం పెద్ద విశేషమే.

నా వివాహ సమయంలో నేను "ప్రజాసేవ" పత్రికకు ఎడిటర్‌గా వున్నాను. అప్పటికి ఆ పత్రిక ప్రారంభించి, నాలుగేళ్లు. వివాహానంతరం కూడా ఆ పత్రిక సంవత్సరం పాటు నిరాటంకంగానే నడిచింది. ఎప్పుడైనా పెద్ద పెట్టుబడి లేకుండ పత్రిక నడపడం కష్టమే. అయినా, డాక్టర్ చలపతిరావు గారు చేతులు కాల్చుకుని అయినా, పట్టుదలతో పత్రికను అంతకాలం నడిపారు. అంతవరకు ప్రజా పార్టీలో వున్న ఆయన 1960లో కాంగ్రెస్‌లో చేరారు. అందువల్ల, పత్రిక విధానం మార్చక తప్పదు. ఇది డాక్టర్‌గారికి, నాకు కూడా