పుట:Manooshakti.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(8)

57

డును. మండలాంతమున పరిశుభ్రమగు యద్దము నొకదానిని దెప్పించి నీప్రతిబింబమందుజూచుచు “ఆహా ! యేమి నారూపలావణ్యము? నాకన్న యందముగ నుండువారలెవరు? నా భాగ్యమేమని చెప్పవచ్చును” అని నీలోనీవొక గదిలోనికి ప్రవేశించి యనుకొనుచుండుము. ఇట్లు పదునైదుదినము లభ్యాసము చేసిన తదనంతరము నీ దేహబలమునందును రూపలావణ్యమునందును తారతమ్యత నీకే తెలియునుగాక.

రూపాయిని చరచర ప్రాకివచ్చునట్లు చేయగలుగుదునా లేదా యని ప్రశ్నించుకొన్నప్పుడు నీవద్దనుండు పెన్సలు నొక దానిని నున్నని స్తలమునందుబెట్టి దానికెదురుగా సుమారిరువది యంగుళముల దూరమున గూరుచుండి కదలిరమ్మని నీమనోశక్తి నుపయోగించుము. అప్పుడు పెన్సిలు చక్రము దొర్లినట్లు దొర్లుచు నీసామీప్యమునకు వచ్చును. అట్లు రానిచో నీవింకను కొన్నాళ్ళు సాధనము (practice) చేయవలసి యుండును. మరల కొన్నాళ్ళు సాధనముచేసిన పిమ్మట తప్పక కదలివచ్చును. ఇటువంటి యభ్యాసమును చేయువారు ముప్పదియైదు సంవత్సరములకు లోపువారైనచో త్వరలో శక్తిని సంపాదింపగలవారగుదురు. ఏవస్తువునైన కదలివచ్చునట్లు జేయదలచిన యెడల నావస్తువుయొక్క బరువంతయు ( Centre of gravity ) నేస్తలము నందుండునో యాచుక్కవంక నీదృష్టిని నిల్పి కదలిరమ్మని మనోశక్తి యుపయోగించుము. నీమనోశక్తి నెంతటిశక్తితో (Force) ప్రయోగింతువో యంతటిత్వరలో గంతులువైచుచు నడచుచుండును. ప్ర