పుట:Manooshakti.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

తివారద్భుతపడుదురు. ఇటువంటి చిత్రపుపనులను జూచినవారందరును నీకు మిత్రులగుదురు. నీవు రూపాయి నెట్లు నడిపించితివని నిన్నెవరయిన యడిగినయెడ నేమియునుదాచక యెల్లయును తెల్లంబుగజెప్పి యతనినిసైతము మనోశక్తిని సంపాదింప ప్రోత్సాహమును జేయుము. ఇట్లు నన్నడిగినవారి నందరను మెస్మరిజమను యీమనోశక్తిని సుపాదించుటకు పలుమారు ప్రోత్సాహమును జేసియుంటిని. తత్కారణమున నాకు మిత్రులగువారందరును సాధారణముగ మెస్మరిజము నభ్యాసము చేయుచుండినవారైరి.

రూపాయిని గంతులువేయించు విధము

రూపాయియొక్క మధ్యభాగమున జూచుచు “గంతులువేయుచు కదలిరమ్ము" అని నీమెస్మరిజ ముపయోగించుము. అప్పుడు రూపాయి గంతులువైచుచు నీవద్దకు పరుగెత్తుకొని వచ్చును. లేక రూపాయిని జరిగివచ్చునట్లు జేయవలెనన్న యంచును చూచుచు "కదలిరమ్ము" అని మనోశక్తితో యనుకొన్నమాత్రమున జరిగిజరిగి నీయొద్దకు నెమ్మది నెమ్మదిగా వచ్చుచుండుట ప్రతివారునుచూచి మిక్కిలి యాశ్చర్య మొందెదరు. అట్లు రూపాయిని నడపించుచున్న సమయమునందు దీపకాంతిగాని మరెట్టికాంతిగాని నీకంటికి తగిలినయెడ నీశక్తి త్వరలో ప్రవేశించి రూపాయి కదలజేయలేదు గావున నీకంటి కెవ్విధమైన కాంతిగాని తగులకుండునట్లు జేసికొని రూపాయిని నడపించుటకై ప్రయత్నము జేయుచుండుము. అట్లు