పుట:Manooshakti.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

డల సంప్రాప్తించుట చాల యాలస్యమగును. అదియునుగాక మెస్మరిజమునం దాసక్తియును తగ్గిపోవును. ఇందుకతన దీనిని యభ్యాసము చేయుచున్నంతకాలమైనను సుఖమును గోరకుండుటయే యుత్తమము. అభ్యాసముచేయుచున్న దినములలో విశేషించి యితరులతో మాటలాడుట తగ్గించవలెను. “ముఖ్యమైన విషయములను గురించి మాటలాడుచుండుము. సాధ్యమైనంతవరకు యొంటరిగ ప్రయాణము జేయుచుండుము. అట్లు వీలులేనిచో ప్రాణమిత్రులతో మాత్రము షికారునకు వెళ్ళుచుండుము. మీగ్రామమునకుగాని పట్టణమునకు గాని నీకేదిక్కు నకు వెళ్ళుటకిష్టముండునో యాదిక్కునకే షికారునకు వెళ్ళుచుండుము. ఒంటరిగాబోవుచున్నపుడు మెల్లగా గాలినిపీల్చి నిలుపగలిగినంతసేపు నిల్పి మెల్లగా బయటకు విడిచిపెట్టుము. నడచునప్పుడు వేయగలిగినంత యంగ వేయుచుండుము. నడచునప్పు డెన్నడును సంగీతము పాడకుము'. నడుమునువంచి నడువకుము." పైన జెప్పినవిధమున కొంతదవ్వునడచి నిర్జనప్రదేశమున గాలికెదురుగా కూర్చుండుము. గాలి కదలకయుండినయెడల నాగ్నేయమూలముఖము గూరుచుండుము. అట్లుగూరుచుండినపుడు నీరొమ్మును బాగుగ ముందరికి విరిచి పిమ్మట మెల్లగా గాలిని లోనికి పీల్చుము. నీవాపగలిగినంతసేపుంచి మెల్లగా వదలివేయుచు నిశ్చలమనస్సుగలవాడవై సుమారిరువదియారుపర్యాయములు ప్రతిదినమును జేయుచుండుము. ఇట్లు మండలదినము లాచరించిన నీ మనంబున కొక యుత్సాహమును, ధైర్యమును బొడముచుం