పుట:Manooshakti.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

55

ఈమనోశక్తికై మీరుత్సాహముతో యభ్యాసము జేసినచో తేళ్ళు మొదలగువానిచే గలుగు బాధలను సుమారైదారునిమిషములలో నివతిన్ జేయగలవారగుదురు.

రాయిని మిక్కిలి సుందరముగల పిట్టను జేయుట.

నీచేతిరుమాలును తీసికొని నీచేతులతో విదలించుము. పిమ్మట యొకరాయిని భూమిపైపెట్టి దానిపై నీచేతిరుమాలును కప్పుము. తరువాత నీమనోశక్తిని రాయిపై యీక్రిందివిధమున నుపయోగించుము. “నేనీరాయిని పిట్టవలెజేసి ప్రతివారికిని చూపించగలను. ఈరాయి నిశ్చయముగా పిట్టయగును. చూచుటకు మిక్కిలి ముద్దును గలిగించుచుండును. విశేషదూర మెగిరిపోలేదు" అని నీమనోశక్తి పావుగంటసే పుప్రయోగించిన రాయిబోయి పిట్టగానుండి బహువింతగా యరచుచు కొంచెము కొంచెముగా యెగురుచుండుట కలవాటు జేయునట్లు నటించును. పట్టుకొనినచో ప్రాణములు బోవునను భీతిచొప్పున దాని నెవ్వరంటుకొనుటకైన సాహసింపరు. ఇట్టి విచిత్రములగు పనుల నెన్నింటినో జేసి నామిత్రులను పలుమారు సంతో'షపెట్టియుంటిని.

ముఖ్యాంశములు.

ఇంతటిమహిమగలిగిన మనోశక్తిని సంపాదించుటకు వాడుకచేయుచున్నంతకాలము సంసార సుఖములను గోరినయె