పుట:Manooshakti.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

డి నీవెనుకభాగంబున నెవ్వరిని లేకుండగా నియమించి నీచేతి రుమాలతో కప్పబడియుండినది పాముగాని మరియొకటిగాదని నీమనోశక్తి నంతయు నుపయోగించుము. చూచువారందరాశ్చర్య మంద నది పామై మెల్లగా కదలుట కారంభించును. అంత నావినోదమును చూడవచ్చినవారలలో నొకనిని పైన కప్పినటువంటి నీచేతిరుమాలను తీయుమనికోరుము. ప్రతివారును తీయుటకు భయమును జెందుచుందురు. గాన నీవట్టిసమయమున దానిని హటాత్తుగా తీసివేయుము. ఏమి యీ యాశ్చర్యము! ఇంతకుముందు నీచేతిరుమాలనుగదా పామువలె చుట్టి నీరుమాలున కడుగుభాగమున నుంచినది? ఇంతలోనె నీవుచుట్టిపెట్టిన రుమాల పట్టుకొనుటకు శక్యముగాక "వట్టిగొ డ్డున కఱపు లెక్కువ" యన్నట్లు దిట్టముగ బుసలుకొట్టుచు చుట్టుపట్టుల నొకనినైన చుట్టియుండనివ్వకుండ పడగనెత్తి బహు పౌరుషముగ నాలుకను జాపుచు కఱచిచంపుదానివలె మిక్కిలి భయంకరముగ గనుపించును. ఆహా! యేమి నీమనోశక్తి యొక్క సొమథ్యము! ఇదిచూచిన వారందరు నీయొద్ద భగవదాంశములున్నవని భ్రమించి నిన్ను మిక్కిలి గౌరవమును జేయుదురు

విభూతిగడ్డను పటిక బెల్లముగా మార్చుట.

నీవొక విభూతిగడ్డను చేతితే తీసికొని నీచుట్టునుండు వారలకెల్లరకును చూపించి యిదేమిటని యడుగుము. ప్రతివారును విభూతిగడ్డని చెప్పుదురు. పిమ్మట, సోదరులారా, మీరందరిప్పుడు పరీక్షించినటువంటి విభూతిగడ్డను పటికిబెల్ల,