పుట:Manooshakti.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

31

వేయకయే మట్టిబోసిన కొట్టియందు చెట్టునుబుట్టించుట నీమనోశక్తివలనగాక మరిదేనిచేత బుట్టుచున్నది? ఇదెంతటి విపరీతము! ఇట్టిశక్తిని నీయందుగలిగియున్నప్పుడు మనోశక్తియందేమియు లేదని చెప్పుచుండెడివారెంతటి తెలివితక్కువవారని చెప్పవచ్చునో చదువరులే గ్రహింతురుగాక .

మిరపకాయను తీపిగా చేయుట.

మిరపకాయ నొకదానిని తెప్పించి నీవుదానివంకజూచుచు “నీయందుకారములేదు తీపిమాత్రమున్నది” అని నీమనోశక్తినుపయోగింపుచూ యిట్లు కొంతసేపు చూచిన పిమ్మట నీస్నేహితులకందర కామిరపకాయను కొంచెము కొంచెముగా పంచిపెట్టి దానిరుచి యెట్లున్నదని యడుగుము. పంచదారవలె తియ్యగా నున్నదని ప్రతివారును బల్కుదురు. నోటిలో వేసికొనిన నోరంతయును మంట బుట్టించి గంతులు వేయించు మిరపకాయను నీమనోశక్తివల్ల పంచదారవలె తీపిని గలుగచేయుచున్నా వే ! యెంతటి యాశ్చర్యము ! ఇంతకన్న వేరుగ సాక్ష్యము గావలెనా ? నీ మనోశక్తి కింతటి సామథ్ర్యముగలదని తెలిసిన ప్రతిమానవుడును దీనిని సంపాదించుటకు ప్రయత్నింప కూరకుండడని నేను మిక్కిలి దృఢముగ జెష్పగలను.

చేతిరుమాలును పాముగా చేయుట.

చదువరులారా ! మీచేతిరుమాలను గుండ్రముగా చుట్టి పామువలె కొంచెము మెలికలు మెలికలుగా బెట్టి దానిపై మరియొక చేతిరుమాలనుగప్పి తూర్పుముఖముగా గూరుచుం