పుట:Manooshakti.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

మాయన గుండెలుఝల్లుమని భయంకరముగ నొక వెఱ్ఱికేకను బిగ్గరగా వైచెను. నేనును సీతారామయ్యగారును దగ్గరనేయుండిన కారణమున మాకిద్దరకును వినబడి వెనుకకు తిరిగి చూచితిమి. అంత నామిత్రుడు బ్రాహ్మణునిజూచి జాలిగొన్నవాడై యాయనను కోతిబారినుండి తప్పింపుడని నన్ను కోరగా మరల నామిత్రుని యభీష్టము చొప్పుననే మనోశక్తిని యుపయోగించి బ్రాహ్మణునిబాధ శీఘ్రకాలములో తొలగించి యుంటిని.

కంటిరా! మన మనోశక్తివల్ల నెంతటి మహోపకార మొనర్చుచున్నామో ! అట్టి సమయమున నీమనోశక్తియనునది లేకుండిన మాగతి యేమిగావలయునో; బాటసారియగు బ్రాహ్మణునిగతి యేమిగావలయునో; చదువరులే గ్రహింతురు గాక. .

ఇదియునుగాక మరియొకపర్యాయము నా మిత్రులగు మ! రా! శ్రీ! కొత్తసీతారామయ్యగారును, జంపాల నారాయణమూతిన్‌గారును, దేవభక్తుని రామయ్యగారును నాతో తెనాలిపురమున యొకనాటిరాత్రి యొంటిగంట సమయమున యొక మిత్రుని గదికి బోవుచుండగ మార్గమధ్యము నందు పది పండ్రెడు కుక్కలు నలువైపులనుజేరి పెద్దగందరగోళమునుజేయ మొదలిడినప్పుడు నామిత్రులు నన్నుజూచి మిత్రమా యీకుక్కల నన్నిటిని యఱవకుండునట్లు జేయుడని నన్ను కోరిరి. నేనుగూడ నందులకంగీకరించి నామిత్రుల కాశ్చర్యమును గలుగజేయనెంచి కుక్కల నఱవకుండగజేసి వానినన్ని