పుట:Manooshakti.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

23

కొనునా? కాబట్టి నాకీమనోశక్తి గలిగియుండిన కారణంబున నాస్నేహితునకట్టి శ్రమనియ్యదలంచక నామనోశక్తిని విడిపించితిని. నాతోనున్న నామిత్రుడు మిక్కిలి యాశ్చర్యమును బొందునట్లుగా కోతి మామీదబడి మమ్ములను కష్టపెట్టుటకు బదులుగా నామనోశక్తివలన పిల్లివలె యేమియు జేయలేక మాయిద్దరను శరణుగోరవచ్చినదానివలె చిందులు, గంతులు, పండ్లుజూపి భయపెట్టుట, మొదలైన వానిని మాని మాపాదములయొద్దకువచ్చి గూరుచుండెను. నాప్రియమిత్రుడగు సీతారామయ్యగారికి వినోదములందు ప్రీతిగనుకను, నామనోశక్తి యొక్క మహిమను తెలియజూపినందునను నేనింకను కొంతసేపు నామనోశక్తి నుపయోగించియుంటిని. పిమ్మట మాకు సామీప్యముననున్న కందేపాటిదిబ్బను నామిత్రుడు చూడనెంచిన మేమిద్దర మచ్చటకుబోవుచుండగ పెంపుడుకుక్కవచ్చు నట్లుగ యకోతి మావెంబడి రాసాగెను. అంత నాప్రియమిత్రుడు భూతదయగలవాడగుటచే, మిత్రమా, యింక నీకోతిని వెళ్ళునట్లు జేయుడని నన్ను కోరగా మరల నామనోశక్తిని దానిపై యుపయోగించి వెళ్ళునట్లుచేసి నా మిత్రుని సంతోషానందభరితునిం గావించియుంటిని. తదనంతర మాకోతి వెళ్ళు చుండగమార్గమధ్యమునందొక బ్రాహ్మణుడు ఎదురుపడుట తటస్థించెను. ఇదివరకువలె కోతి పొంధులను గష్టపెట్టుటకు మరల మొదలిడునప్పటికి కాలవశమున బ్రాహ్మణు డెదురుపడిన కారణమున కోతి యావిప్రుని సమీపించి కుచుటకు నోరు దెఱచి మీదదుముకుటకు సిద్ధముగనుండు సమయమున పాప