పుట:Manooshakti.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

నేనొకనాటిసమయమున మాగ్రామమగు మోదుకూరుపురమున కాగ్నేయభాగమునందున్న నీరారెడ్డి చెఱువు వద్దకు నాప్రాణమిత్రుడైన సంగముజాగలన్‌మూడి పురవాసి మ!రా!రా!శ్రీ. కొత్త సీతారామయ్యగారితో సాయంతనమున షికారుకుబోవుచుండగ చెఱువునకు సామీప్యమునకోతి యొకటియున్నదనియును దానిమెడయందొకగొలుసుకొక్కె.ముండుటచే యాకోతియెచ్చటనుండియో సర్కసునుండితప్పించుకొనివచ్చినదనియును దారినిబోవువారినెల్లరను కఱచి గుడ్డలను చింపివేసి పలుబాధల పెట్టుచున్నదనియును పాంధులుకొంత మంది మర్కటముచే ప్రాయశ్చిత్తమును జేయించుకున్న వారు సైతము మమ్ములనిద్దర నాదారిని బోవలదని మిక్కిలిబలవంతమును జేసియుండిరి గాని నేను మాత్ర మట్లువెళ్ళుటకు సంశయించి యుండలేదు. నా మిత్రునకు నేనీ మనోశక్తిని జంతువులమీదగూడ జూపగలనని తెలియకున్నందున కోతివలన నాకించుకయు హానిరాకుండ గాపాడవలెనని తుండుగుడ్డను తనచేతికి చుట్టుకొని కోతిని పట్టుకొనుటకు సిద్ధపడుచుండెనుగాని, మిత్రమా నీవు నాకొరకిట్లు సాహసింపవలసిన యవసరములేదని చెప్పుచుండగ నామర్కటము మమ్ముల నిద్దరను సమీపించి కఱచుటకు బహు తొందరపడు చుండెను. నామిత్రుడు మిక్కిలి ధైర్యవంతుడును స్నేహితుల యెడ ప్రాణమునైన యిచ్చివేయునటు వంటివాడును యగుటచే పరుగెత్తుకొనివచ్చు కోతిని పట్టుకొని కట్టివేయుటకు సిద్ధపడుచుండగ “గరిటెయుండగ చేయిగాల్చికొన " నెట్టివాడైన యొప్పు