పుట:Manooshakti.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

21

యొకదానికొకటి సుమారైదంగుళముల దూరమునబెట్టి నీవు తూర్పుముఖముగా కాయలకు పదునైదంగుళముల దూరమున కూర్చుండి “ఓనిమ్మకాయలార! మీరిద్దరును గొఱ్ఱెపొట్టేళ్లవలె కొంచముసేపు పోట్లాడిన నిచ్చటనుండువాఱందరును మీయద్భుతకార్యంబునుజూడ కుతూహలపడుచున్నారు గాన త్వరగా పోట్లాడుడు” అని నీదృష్టి నుపయోగించుచు మనోదృఢముతో నీలోనీవనుకొనుము. యిట్లు సుమారు రెండునిమిషము లనుకొనిన వెంటనే చూచువారందరాశ్చర్య మొంద నిజమయిన గొఱ్ఱెపొట్టేళ్ళవలె నిమ్మకాయలు రెండును బహుపౌరుషముగ నీమనోశక్తి నుపయోగించినంత కాలము పోట్లాడుచునేయుండును. కంటిరామనోశక్తివలన నెంతటి యాశ్చర్యములగుకార్యములను జేయవచ్చునో? యిట్టి సులభ పనులను పెక్కింటిని యవలీలగ జేయవచ్చును. గాన మనోశక్తిని సంపాదించుటకయి ప్రతిదినమును సర్వేశ్వరుని ప్రార్థింపరాదా! అట్లు ప్రార్థించినచో నీకట్టిశక్తి నీయకుండుట కంత నిర్దయుడా ! కాదు, కాదు. కరుణారసపూరితుడై యెల్లరకును మిక్కిలి తోడగుచుండును. గనుక మనోశక్తి గావలయునన్న సకలలోకాధీశ్వరుడగు యీశ్వరుని నీహృదయకమలమునందు ధ్యానించుచు మనోశక్తినిపొందుటకు తగిన సదుపాయములతో నభ్యాసము (Practice) ను దిట్టంబుగజేయుచుండిన పట్టుబడకయుండుట వట్టిదియా! యిట్టి మనోశక్తిని నాకుమిత్రులయినవారలలో చాలమంది కొంచెము కొంచెముగా గలిగియుండిరి.