పుట:Mana-Jeevithalu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

లేడి ఒకటి పట్టరాని కుతూహలంతో చూస్తోంది. మా రాకతో మెరుపులా మాయమైపోయిందది. మట్టిరంగు పొద క్రింద బోదురు కప్ప ఒకటి వెడల్పాటి కొమ్ములతో పెద్ద కళ్లతో చలనం లేకుండా ఉంది. పశ్చిమం వైపు కొండలు అస్తమిస్తున్న సూర్యకాంతిలో మొనదేలి స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటికి బాగా దిగువున ఒక పెద్ద భవనం ఉంది. దానిలో ఈతలాడే నీటిమడుగు ఉంది. అందులో ఎవరో కొంతమంది ఉన్నారు. ఆ ఇంటి చుట్టూ అందమైన తోట ఉంది. ఆ ప్రదేశం సంపదతో తులతూగుతూ, మిగతావాటికి దూరంగా ఒకవిధమైన ధనిక వాతావరణంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంకా దిగువున దుమ్ముతో నిండిన దారి ప్రక్కన ఎండిపోయిన పొలంలో ఒక చిన్న గుడిసె ఉంది. దారిద్ర్యం, అశుభ్రత, కాయకష్టం, అన్నీ అంత దూరం నుంచే కనిపిస్తున్నాయి. అంత ఎత్తునుంచి చూచినప్పుడు ఆ రెండింటికీ అట్టే ఎడం కనిపించలేదు. కురూపితనం, అందం, రెండూ ఒకదాన్ని ఒకటి అంటి పెట్టుకునే ఉన్నాయి.

వస్తు వాహనాలు కలిగి ఉండటంలో నిరాడంబరత కన్న హృదయ నిరాడంబరత చాలా ముఖ్యమైనది, అర్ధవంతమైనది. ఏవో కొద్ది వస్తువులతో తృప్తిపడి ఉండటం అంత కష్టం కాదు. సౌఖ్యాన్ని వదులుకోవటం, ధూమపానం మొదలైన అలవాట్లను మానివెయ్యటం - ఇవి హృదయ నిరాడంబరతని సూచించవు. వేషభూషణాలతో, సౌఖ్యాలతో, అనేక ఆకర్షణలతో నిండి ఉన్న ప్రపంచంలో గోచీగుడ్డ కట్టుకుని తిరిగినంత మాత్రాన స్వేచ్ఛా జీవనాన్ని సూచించదు. సంసారాన్నీ, ప్రాపంచిక ధర్మాల్నీ త్యజించిన మనిషికే లోలోపల కోరికలూ, కాంక్షలూ, దహించివేస్తూ ఉంటాయి. పైకి సన్యాసి వేషం వేసినా శాంతి అనేది ఎరుగడు. అతని కన్నులు నిత్యం దేనినో అన్వేషిస్తూనే ఉంటాయి. అతని మనస్సుని సంశయాలూ, ఆశలూ దొలుస్తూ ఉంటాయి. పైకి క్రమశిక్షణ అలవరచుకుంటారు. అన్నిటినీ త్యజిస్తారు. క్రమక్రమంగా మీ లక్ష్యాన్ని చేరుకోవటానికి మీ పథాన్ని మీరు నిర్మించుకుంటారు. మీ అభివృద్ధిని సద్గుణాల కొలమానంతో కొలుచుకుంటారు - ఇది మానేశారో లేదో, అది మానేశారో లేదో, మీ ప్రవర్తనలో ఏ మాత్రం నిగ్రహం చూపిస్తున్నారో, ఎంత సహనం, ఎంత దయ చూపిస్తున్నారో, అంటూ మనస్సుని కేంద్రీకృతం