పుట:Mana-Jeevithalu.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

320

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

నిర్ణయం తీసుకుని వ్యవహరించవలసిన పరిస్థితి ఏర్పడింది. నాకు ఎవ్వరికీ హాని కలుగజెయ్యాలని లేదు. నాకేం చెయ్యాలో తోచటం లేదు."

ఏది ఎక్కువ ముఖ్యం? హాని కలిగించకుండా ఉండటమా, శత్రుత్వం ఏర్పడకుండా చేయటమా, లేక ఏదో ఒకపని చెయ్యటమా?

"నేను పనిచేసేటప్పుడు కొందరికి హాని కలిగిస్తాను. పనిలో మునిగి పోయేటటువంటి వాళ్లలో నేను ఒకణ్ణి. నేను ఏదైనా చేపడితే అది ముగించి తీరాలనుకుంటాను. నేనెప్పుడూ అంతే. నేను సమర్ధుణ్ణేననుకుంటాను. అసమర్థత చూస్తే నాకసహ్యం. ఎంతైనా, ఏదో ఒకరకమైన సంఘసేవ చెయ్యటానికి పూనుకున్నప్పుడు దాన్ని పూర్తిగా నెరవేర్చాలి కదా. సమర్థతలేని వాళ్లకీ, బద్ధకస్తులకీ సహజంగా హాని కలిగి, వాళ్లు విరోధులవుతారు. ఇతరులకు సహాయం చేసే పని ముఖ్యం. అవసరమైన వాళ్లకు సహాయపడటంలో దానికడ్డం వచ్చేవాళ్లని గాయపరుస్తాను. కాని ఎవరికీ హాని కలిగించటం నాకిష్టంలేదు. ఈ విషయమై ఏదో చేసితీరాలని గ్రహించాను."

మీకు ఏది ముఖ్యం: పనిచెయ్యటమా, లేక ఇతరులకు హాని కలిగించటమా?

"అంత బాధని చూసినప్పుడు పరివర్తన తీసుకురావటానికి ఉద్యమిస్తాం. ఆ పనిచేసేటప్పుడు కొందరికి హాని చెయ్యటం జరుగుతుంది - ఎంతో అయిష్టంగానే అయినా."

కొంతమందిని రక్షించటంలో, మరి కొంతమంది నాశనమవుతారు. ఒకదేశం మరోదేశాన్ని నష్టపరచి తాను నిలబడుతుంది. ఆధ్యాత్మికులమని చెప్పుకునే వారు పరివర్తన తీసుకురావాలనే ఆత్రుతతో కొందర్ని రక్షించి మరికొందర్ని నాశనం చేస్తారు. వారు ఆశీర్వచనాలూ ఇస్తారు. శాపాలూ ఇస్తారు. మనం ఎప్పుడూ కొందరి మీద దయ చూపించి మరి కొందరితో నిర్దయగా ఉంటాం. ఎందువల్ల?

మీకు ఏది ముఖ్యం : పనిచెయ్యటమా, ఇతరులకు హాని కలిగించకుండా ఉండటమా?

"ఎంతైన, కొంతమందికి హాని కలిగించాలి - బద్దకస్తులకీ,