పుట:Mana-Jeevithalu.pdf/328

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
319
పని

ఇది శ్రమదాయకమైనది. కాని అందులో ఆనందం ఉంటుంది, స్వేచ్ఛగా ఉన్నవారికే ఆనందం ఉంటుంది. ఉన్నస్థితి అనే సత్యంతోబాటే స్వేచ్ఛ ఉంటుంది.

88. పని

ఎవ్వరితోనూ కలవకుండా, దేనిలోనూ విశ్వాసం లేనట్లుగా ఉన్న ఆయన ప్రభుత్వ యంత్రాంగంలో ఏదో మంత్రి. ఎవరో తీసుకొస్తే వచ్చాడు. బహుశా స్నేహితుడు ఈడ్చుకొచ్చి ఉంటాడు. తను అక్కడ ఉన్నందుకు తనే ఆశ్చర్యబోతున్నట్లున్నాడు. ఆ స్నేహితుడు ఏదో మాట్లాడటానికి వస్తూ ఆయన్ని తన కూడా తీసుకువచ్చి ఉంటాడని తెలుస్తూనే ఉందీ. తన సమస్య గురించి ఆయన కూడా వినాలని తీసుకొచ్చి ఉంటాడు. మంత్రి కుతూహలంగా, ఉన్నతస్థాయిలో ఉన్నట్లుగా ఉన్నాడు. ఆజానుబాహుడు, చురుకుగా గమనిస్తాడు. ధారళంగా మాట్లాడగలడు. జీవితంలో సాధించవలసింది సాధించాడు. ఇప్పుడు స్తిమితపడుతున్నాడు. ప్రయాణం చెయ్యటం ఒకటి, చేరటం మరొకటి. ప్రయాణం చెయ్యటమంటే నిత్యం చేరుతూ ఉండటం. మళ్లీ ప్రయాణం లేకుండా చేసుకోవటమంటే మరణమే. మనం ఎంత సులభంగా తృప్తిపడిపోతాం, ఎంత త్వరగా అసంతృప్తి తృప్తి పొందుతుంది! మనందరికీ ఏదో విధమైన ఆశ్రయం కావాలి, అన్ని రకాల సంఘర్షణ నుంచీ తప్పించుకునే ఆశ్రయం కావాలి. సాధారణంగా మనకి దొరకుతుంది. గడుసువాళ్లు కూడా తెలివి తక్కువ వాళ్లలాగే తమ ఆశ్రయాన్ని తాము కనుక్కుని, దాంట్లో జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూ ఉంటారు.

"ఎన్నో సంవత్సరాల నుంచీ నా సమస్యని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. కాని ఇంతవరకు దాని అమూలంగా తెలుసుకోలేక పోయాను. నేను చేసే పనిలో ఎప్పుడూ వైరుధ్యాన్ని తెచ్చుకున్నాను. నేను సహాయపడటానికి ప్రయత్నించిన వాళ్లలోనే శత్రుత్వం ఎలాగో తలదూర్చేది. కొందరికి సహాయం చెయ్యటంతోనే మరికొందరి వ్యతిరేకతకి బీజం వేసేవాడిని. ఒక చేత్తో ఇచ్చి మరో దాంతో గాయపరిచినట్లుండేది. ఇలా ఎన్ని సంవత్సరాలుగా జరుగుతోందో నాకు గుర్తు కూడా లేదు. ఇప్పుడు నేను ఏదో ఒక