పుట:Mana-Jeevithalu.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

276

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.


"గెలుపు లేకుండా గుర్తింపు లేకుండా ఎవరు బ్రతికి ఉండాలనుకుంటారు?"

ఈ గెలుపునీ, మెప్పుని వాంఛించటం వల్లనే మనలోనూ, మన బయటా సంఘర్షణ రావటం లేదా? ఆకాంక్ష లేకుండా ఉంటే క్షీణించినట్లేనా అర్థం? సంఘర్షణ లేకుండా ఉండటమంటే వృద్ధి లేకుండా స్థిరపడి పోవటమేనా? మందులు పుచ్చుకుని మన నమ్మకాలతో, సిద్ధాంతాలతో సహా మనల్ని మనం నిద్రపుచ్చుకుంటాం. అందువల్ల ఏ గాఢ సంఘర్షణలూ ఉండవు. మనలో చాలా మందికి ఏదో ఒక కార్యకలాపం మందులా పనిచేస్తుంది. నిజానికి అటువంటి పరిస్థితిలోనే క్షయం, వినాశం ఉంటాయి. అసత్యమైన దాన్ని అసత్యమని తెలుసుకోవటంతో మరణం వస్తుందా? వృద్ధిలోకి రావాలనే ఆకాంక్ష ఏ రకమైనదైనా, అది దేవుడికోసమైనా, గెలుపు కోసమైనా, అట్టి ఆకాంక్ష లోపల నుంచి బయట పడకుండా సంఘర్షణ తీసుకొస్తుందని తెలుసుకుంటే, నిజానికి దాని అర్థం - సమస్త కార్యాలకీ, జీవితానికీ అంతం అని కాదు.

మనం వృద్ధిలోకి రావాలనే ఆకాంక్షతో ఎందుకున్నాం?

"ఏదో ఒక ఫలితాన్ని సాధించటానికి కష్టపడే వ్యాపకం లేనట్లయితే, నాకు విసుగెత్తి పోతుంది. నా భర్త అభివృద్ధినే ఆకాంక్షించేదాన్నిదివరకు. నా భర్త కోసం అన్నప్పటికీ, ఆయన ద్వారా నా కోసమే అనుకుంటాను. ఇప్పుడు నా వృద్ధి కోసమే నేను ఆకాంక్షిస్తున్నాను ఒక ఉద్దేశంతో. వృద్ధిలోకి రావాలనే ఆకాంక్ష గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. ఆకాంక్షించానంతే."

మనం ఎందుకు గడుసుగా ఉంటాం, వృద్ధిలోకి రావాలని ఎందుకు ఆకాంక్షిస్తాం? వృద్ధిలోకి రావాలనే ఆకాంక్ష ఉన్నస్థితి నుంచి తప్పించుకోవటానికి కాదా? ఈ గడుసుతనం నిజానికి తెలివి తక్కువతనం కాదా? అసలు మనం తెలివి తక్కువ వాళ్లమే కాదా? ఉన్నస్థితి ఎప్పుడూ ఉండేదే అయితే దాన్నుంచి పారిపోవటం వల్ల ఏం లాభం? తప్పించుకోవటంలో మనం గెలుపొందవచ్చు. కాని మనం ఉన్నస్థితి అలాగే ఉంటుంది సంఘర్షణనీ, సుఖాన్ని సంపాదిస్తూ. మనం ఒంటరితనం అన్నా, శూన్యత అన్నా ఎందుకంత భయపడతాం? ఉన్నస్థితి నుంచి దూరంగా పారిపోవాలని