పుట:Mana-Jeevithalu.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను ఎలా ప్రేమించను?

187

మంచిగా అవటంలో పాపభీతి ఉంటుంది. సంపూర్ణంగా అవటంలో ఒంటరితనం అంటే భయం ఉంటుంది. గొప్పగా అవటంలో చిన్నతనం గురించి భయం ఉంటుంది. పోల్చటం, అవగాహన కాదు. తెలిసిన దానివల్ల తెలియనిదంటే ఉండే భయం వల్ల చేసే పని అది. రక్షణ కోసం వెతకటంలోని అనిశ్చితస్థితి భయం.

ఏదో అవాలనే ప్రయత్నంతోనే భయం ఆరంభమవుతుంది - ఉన్నదాన్ని గురించీ, లేనిదాని గురించీ, మనస్సు అనే అనుభవశేషం ఇంతకు ముందెరుగని, పేరుపెట్టని సమస్య ఏదో ఎదురవుతుందనే భయంతో ఉంటుందెప్పుడూ. మనస్సు అనే పేరు, మాట, జ్ఞాపకం తెలిసిన జాగాలోనే పనిచెయ్యగలదు. తెలియని దాన్ని, అంటే క్షణక్షణానికీ ఎదురయే సమస్యని ప్రతిఘటించటమో, మనస్సు తనకి తెలిసిన మాటల్లోకి అనువదించటమో, జరుగుతుంది. ఈ ప్రతిఘటించటం, లేదా సమస్యని అనువదించటం - ఇదే భయం. ఎందువల్లనంటే, మనస్సు తెలియని దానితో సంపర్కం కలిగించుకోలేదు. తెలిసిన దానికి తెలియని దానితో సంపర్కం ఉండదు. తెలిసినది అంతమొందాలి తెలియనిది ఉండాలంటే.

మనస్సే భయాన్ని పుట్టిస్తుంది. అది భయాన్ని విశ్లేషించి, దాన్నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తుంది. దానికి కారణాన్ని వెతికినట్లయితే, మనస్సు మరింత వేరుపడి, భయాన్ని అధికం చేస్తుంది. మీరు గందరగోళాన్ని ప్రతిఘటించటం వల్ల భయం ఎక్కువవుతుంది. దానివల్ల స్వేచ్ఛకు ఆటంకం ఏర్పడుతుంది. సంపర్కంలో స్వేచ్ఛ ఉంది - భయంలో కాదు.


59. నేను ఎలా ప్రేమించను?

మేము పర్వతం మీద బాగా ఎత్తున ఉన్నాం. క్రింద లోయ కనిపిస్తోంది. పెద్ద నదీ ప్రవాహం ఎండలో వెండితాడులా ఉంది. అక్కడక్కడ ఆకుల గుబురుల మధ్య నుంచి ఎండపడుతోంది. ఎన్నో రకాల పువ్వుల సువాసన వస్తోంది. ఆ ఉదయం రమణీయంగా ఉంది. నేలమీద మంచు ఇంకా ఒత్తుగా ఉంది. సువాసనతో కూడిన గాలి లోయ మీదుగా వస్తోంది. దాంతో