పుట:Mana-Jeevithalu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

92

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

కలలున్నాయి. ఆయన ఆత్రుతగా, ఉత్సాహంగా ఉంటాడు. ఆయన సుఖాలు చాలా సామాన్యమైనవి. ఇతరులకేవైనా చిన్న చిన్న పనులు చేసిపెట్టటంలో సంతోషాన్ని పొందుతాడు. ఆయన తనకి ధనమన్నా, భౌతిక సుఖాలన్నా పెద్ద మోజు లేదన్నాడు. కాని, డబ్బుంటే ఏం చెయ్యదలుచుకున్నాడో వివరంగా చెప్పటం ఇష్టం ఆయనకి. దేనికో ఒకదానికి సహాయం చేస్తాననీ, సలక్షణమైన పాఠశాల ప్రారంభిస్తాననీ, ఇంకా ఎన్నో చెప్పాడు. ఆయన కలగంటున్నట్లుగానూ, తన ఉత్సాహంలోనూ, ఇతరుల ప్రభావంలోనూ పడికొట్టుకుపోతున్నట్లుగా ఉన్నాడు.

ఎన్నో ఏళ్లకి మళ్లీ వచ్చాడాయన. ఆయనలో ఒక చిత్రమైన పరివర్తన వచ్చింది. ఆ స్వాప్నిక దృష్టిపోయింది, వ్యవహార దృష్టితో, నిశ్చితంగా, కర్కశమైన అభిప్రాయాలతో, కఠినమైన నిర్ణయాలతో ఉన్నాడు. ఆయన దేశాలు తిరిగాడు. ఆయన ప్రవర్తన ఎంతో సంస్కృతి ఉట్టిపడేట్టుగానూ, సభ్యత అలవరచుకున్నట్లుగానూ ఉంది. తన సమ్మోహనా శక్తిని మధ్య మధ్య ప్రదర్శిస్తున్నాడు. ఆయనకి చాలా ఆస్తి సంక్రమించిందిట. దాన్ని ఎన్నో రెట్లు అధికం చేశాడుట. మనిషి పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు ఆయన రావటం అరుదైపోయింది. ఎప్పుడైనా వచ్చి కలుసుకున్నప్పుడైనా, ఎంతో దూరాన ఉన్నట్లూ, తన చుట్టూ గోడ కట్టుకున్నట్లూ ఉంటాడు.

దారిద్ర్యం, సంపదా కూడా బంధనాలే. దారిద్ర్యాన్నీ, సంపదల్నీ మనస్సులో పెట్టుకున్న వారు పరిస్థితుల చేతుల్లో కీలు బొమ్మలవుతారు. అవి రెండూ మనిషిని చెడిపేవే. ఆ రెండూ చెడు చేసే దాన్నే అభిలషిస్తాయి. అధికారాన్ని కోరతాయి రెండూ. అధికారం ఆస్తిపాస్తుల కన్న గొప్పది. అధికారం సంపదకన్నా, భావాలకన్నా గొప్పది. ఇవన్నీ బలాన్నిస్తాయి. అయినా, వాటిని వదులుకోవటం సాధ్యమే. కాని, అధికార భావం ఉండి పోతుంది. అధికారాన్ని నిరాడంబర జీవితం ద్వారా గాని, సద్గుణం ద్వారా గాని, రాజకీయ పక్షం ద్వారా గాని, త్యజించడం ద్వారా గాని పొందవచ్చు. కాని ఆ మార్గాలన్నీ ప్రత్యామ్నాయం మాత్రమే. అవి ఎవరినీ మోసగించలేవు. హోదా, పలుకుబడి, అధికారం కావాలనే కోరిక ఎంతో సహజంగా పుట్టినట్లుంటుంది. బలప్రయోగం వల్ల గాని, నమ్రత వల్ల గాని, జ్ఞానం వల్ల