పుట:Mahendrajalam.djvu/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహేంద్రజాలం

(ఇంద్రజాల రహస్యాలు)

పామును పడగ విప్పకుండా చేయుట

1. ఎలాంటి భయంకరమైన (లేక, దేవతా) సర్పమైన పెద్ద ఉల్లిపాయ (వెల్లుల్లి) ను నూరి వాసన సూపినా, మధ్యకు కోసి వాసన చూపినా - పాము పడగ విప్పకుండా ముడుచుకు పోతుంది. లేకపోతే పారిపోతుంది.

2. పై విధంగానే తెల్ల ఈశ్వరీ వేరునుదెచ్చి, గంధము తీసి, సర్పమునకు వాసనచూపినా పడగ విప్పలేదు.

ఈ ప్రదర్శన చేయువారు ఈ రెంటిలో దేనినైననూ ఆచరించవచ్చును. ఈ ప్రదర్శనకు పాము స్వంతమైనదే కానక్కరలేదు. అప్పటికప్పుడు ఎవరైనా పామును తెచ్చి - పడగవిప్పకుండా చేయమన్ననూ నిరభ్యంతరముగా పై విధానంతో పాము పడగ విప్పకుండా చేయవచ్చును.


నిద్రపుచ్చుట

ఇంద్రజాలికుడు ప్రేక్షకులతో - నిద్రపోనని భీష్మించుకొని వున్న వారిని సైతం నా మహిమతో నిద్రపుచ్చుతానని చెప్పి - వచ్చిన వ్యక్తిని నిద్ర పుచ్చి - అందరిని ఆశ్చర్య పరుచవచ్చును.

ఆ రహస్యం ఏమిటంటే ? విషముష్టి అనే చెట్టు వేరును దెచ్చి, దాని నూనెను దీసి - ఆ నూనెను కుంకుమలోనో,