పుట:Maharshula-Charitralu.firstpart.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

మహర్షుల చరిత్రలు


"అత్రి సంహిత"

ఒకమాఱు ధర్మసంసక్తు లగుఋషు లత్రిమహర్షిని దర్శించి "మహాత్మా! నీవు విశ్వవిదుఁడవు. ఋషిశ్రేష్ఠుఁడవు. విశ్వహితోదయుఁడవు కావున, మా యందుఁ గటాక్షముంచి దైవములలో నుత్తమదైవ మెవరు? ఏది పరమధర్మము? ఏది పరమవిధి ? పరమేశ్వరు నర్చించువిధాస మేది? అను సంశయములను దీర్పు" మని వేఁడుకొనిరి. అత్రిమహర్షి చాల సంతసించి వారి నెల్లరఁ దగురీతి సమ్మానించి యిట్లు పలికెను. "ఋషులారా! సర్వదేవతలలోను , శ్రీమన్నారాయణుఁడే యుత్తమోత్తమదైవము,. ఈతఁడే పరంధాముఁడు, పరంజ్యోతి, సర్వకారణకారణుఁడును. ఉపవాస వ్రతదాన స్వాధ్యాయాదులచే నాతని నర్చించుటయే పరమధర్మము, పరమవిధి. ఇహాముత్ర సుఖముల కాతని నర్చించుట - అమూర్తార్చనము, సమూర్తార్చనమని - ద్వివిధము, అగ్న్యాహుతి యమూర్తార్చనమనియుఁ బతిమాద్యర్చనము సమూర్తార్చన మనియుఁ దెలియవలెను. వైఖానసమతము ననుసరించిన యర్చనమే యుత్తమము. సాయంప్రాతల యందు గృహమునఁ గాని దేవాలయమునఁ గాని ద్విజులు భక్తిభావముతో నగ్నిహోత్రాది హోమాంతముగాఁ బరమేశ్వరప్రతిమను బూజించుటే సమూర్తార్చనము. భృగుఁడు కాస్యపుఁడు, మరీచి. నేను దీని నభినందింతు" మని యత్రిమహర్షి యామూలాగ్రముగా నుపదేశించెను. ఇదియే 'యత్రిసంహిత' గా విఖ్యాతి గాంచినది.

ఇం దత్రిమహర్షి కర్మ, ప్రతిష్ఠ. పూజన, స్నపనోత్సవ ప్రాయశ్చితము లను విభాగముల క్రిందఁ దన విషయమును విభజించెను. ఇందు మొదటిభాగమున దేవాలయస్థల పరిశీలనము, దేవాయతన రూపము; దైవప్రతిమానిరూపణము మున్నగు విషయములును, రెండవభాగమునఁబ్రధాన పరివార దేవతాప్రతిష్టాదికము, మూఁడవభాగమునఁ బూజావిధానమును, నాల్గవభాగమున మహాభిషేకవివరణము, ఐదవభాగమున నుత్సవవిశేషములుఁ బ్రత్యేకోత్సవములుఁ దన్నిబంధనములును, నాఱవభాగమునఁ బూర్వోక్తవిధానములందలి దోషాదికమునకుఁ బ్రాయశ్చిత్తమును వివరింపఁ బడినవి. ఈ ప్రకార మత్రిమహర్షి