పుట:Maharshula-Charitralu.firstpart.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అత్రి మహర్షి

41


పిదప శ్రీరాముఁడు భార్యానుజులతో నత్రిమహర్షి యాశ్రమమున కేతెంచెను. అత్రిమహర్షి యు వారిని మిగుల మన్నించి యనసూయాదేవి మాహాత్మ్యము వారల కెఱిఁగించెను. సీతాదేవి యనసూయ వలనఁ ఇతివ్రతాధర్మములు విని యామెకుఁ దన వివాహవృత్తాంతమును దెల్పెను. ఆనసూయయు సీతకు నూతనాంబర ధూషణములతో శశ్వదలంకృతి యగు కుంకుమ నిచ్చి యాశీర్వదించెను. ఆ రాత్రి సీతారామలక్ష్మణు లత్రిమహర్షి యాశ్రమమునఁ గడిపి మఱునాఁ డుదయమున బయలు దేఱి యేఁగిరి.[1]

అత్రిమహర్షి యపరిగ్రహవ్రతపాలవము

అత్రిమహర్షి మొదటఁ గొంతకాలము కశ్యప విశ్వామిత్రాదులతోఁ గలిసి భూమిపైఁ జరించుచుఁ దపశ్చరణతరుఁడై యుండెను. కొంతకాలమున కొకమహాక్షామము సంభవించెను. ప్రతిగ్రహము చేయమని వ్రతము ధరించిన సప్తర్షులు నాఁకలి దీర్చుకొనుటకై యొక శవమును దినఁదొడగిరి. వృషాదర్భి యను రాజు వారికడ కేఁగి భోజనపదార్ధములఁ బంపెద ననెను. కాని వారు గ్రహింపమనిరి. రహస్యముగా నాతఁ డంపగా వా రంగీకరింపకుండిరి. కొంతకాలము వారు తామరతూండ్లు తిని బ్రతుకనెంచి యొకకొలనుఁ జొచ్చి కొన్ని బిషనాళములను బ్రోగుచేసి కట్టఁ గట్టి గట్టుపై బెట్టి సుస్నాతులై వచ్చుసరికి, దేవేంద్రుఁడు ప్రచ్ఛన్న వేషుఁడై యా తామరతూండ్లను దాఁచివేసెను. సప్తర్షులు నెవరు దాచినది తెలియక తామరతూండ్ల నపహరించినవానికిఁ గల్గుదోషముల నిర్వచింపఁ దొడఁగిరి. అంత నింద్రుఁడు వారి యపరిగ్రహమునకు వ్రతపాలసకుఁ దపఃప్రధాన జీవితమునకు మెచ్చి స్వస్వరూపియై మహర్షులతో నత్రిమహర్షిని స్వర్లోకమునకుఁ దీసికొనిపోయి యనేకవిధములఁ బూజించి కృతార్థుఁ డయ్యెను.[2]

  1. రామాయణము.
  2. భారతము - అనుశాసనిక పర్వము.