పుట:Maharshula-Charitralu.firstpart.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దుర్వాసో మహర్షి

149


గైలాసమున కేఁగి పార్వతీపరమేశ్వరులపాదసేవ చేయుటే పరమ కర్తవ్యమని యెంచి భార్యతోఁగాని శ్రీకృష్ణునితోఁగాని చెప్పకయే కైలాసమున కేఁగి పార్వతీపరమేశ్వరుల పాదములపై వ్రాలెను. శివుఁ డాతనిఁగౌఁగిలించుకొని యాశీర్వదించెను. పార్వతియు దీవించి విశేషము లడిగెను. దుర్వాసుఁడు "అమ్మా ! భూలోక జీవనమునఁ బ్రాణము విసిగినది. ఇఁక మీకడనే యుండి మీపవిత్ర పాదారవిందముల భక్తితోఁ గొల్చుచు నుండ నిశ్చయించుకొని వచ్చితి" ననెను. శివుఁ డానందించి పార్వతి వదనారవిందముఁ దిలకించెను. పార్వతి “పుత్త్రా! నీవు మాకడ నుండిపోవుట మా కానందప్రదమే. కాని, నాయంశమునఁ బుట్టినయోగమాయను వివాహ మైతివికదా! ఆమె నచట విడిచి వచ్చితివి. ఆమె యందుల కెంతయు ఖిన్నయై నీకై పలవించుచున్నది. అగ్నిసాక్షిగ వివాహమైన భార్య నకారణముగా నట్లు విడువఁ దగునా? ఆమె మహా పతివ్రత. ఆమె వలన నీకు సత్సంతానము కలుగును. మఱియు, శ్రీకృష్ణుఁడు మానవమాత్రుఁడు కాఁడు. గోలోకవాసి యగు పరబ్రహ్మమే యాతఁడు. ఆయన పాదపద్మములు కొల్చుట మా సేవచేయుటకన్నఁ గోటిమడుంగు లధికము. కావున, నీ వట కేఁగి వలయునపుడు వచ్చిపోవుచుండు" మని బోధించెను. దుర్వాసుఁ డామెమాట లాలించి యా జగన్మాతాపితలకు వందనము లొనర్చి తిరిగి ద్వారకకుఁ బోయి సుఖముండెను.[1]

దుర్వాసుఁడు శ్రీకృష్ణుని యాదపులను శపించుట

దుర్వాసోమహర్షి యొకనాఁడు కృష్ణునిఁ బరీక్షింప వేఁగ సత్యభామగృహమున నున్న శ్రీకృష్ణుఁడు సత్యాసహితుఁడై దుర్వాసు నెంతయుఁ బూజించెను. దుర్వాసుఁ డాతని శాంతమరయుటకై యొకరథ మెక్కి దానికి సత్యామాధవుల రథ్యములఁ గండనెను. వా రుభయులు వెంటనే యామహర్షి యాజ్ఞ శిరసావహించి యాతఁ

  1. శివపురాణము.